Newspillar
Newspillar
Tuesday, 17 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- ప్రజాశాంతి పార్టీ (Prajashanti) అధినేత కేఏ పాల్ (KA Paul) ఏం మాట్లాడినా  కొంత ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలోను పాల్ కీలక కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు కేఏ పాల్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తుకారం గేట్‌ లోని మాంగర్ బస్తీలో పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న  ఆశావాహులు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు కేఏ పాల్.