Newspillar
Newspillar
Saturday, 21 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్‌ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ధీమా వ్యక్తం చేశారు. శామీర్ పేట సమీపంలోని తూంకుంటలో ఓ కన్వెన్షన్‌ హాలులో గజ్వేల్‌ (Gajwel) నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో శుక్రవారం కేసీఆర్‌ బేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నామని ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు చెప్పారు కేసీఆర్. తెలంగాణకే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతామని మరోసారి ప్రకటించారు. ఇకపై నెలలో ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్‌ నియోజకవర్గానికి కేటాయిస్తానని సీఎం కేసార్ అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద కూడా ఉండకూడదన్నదే తన లక్ష్యమని చెప్పారు. గజ్వేలులో ఒక విడత మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయన్న కేసీఆర్, గజ్వేలులో రెండో విడతలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. తనను ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్న సీఎం, కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పార్టీ నేతలకు చెప్పారు.