Newspillar
Newspillar
Friday, 20 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు (Singareni Workes) శుభవార్త చెప్పింది. సింగరేణి కార్మికులకు బోనస్ క్రింకద 711 కోట్లు రూపాయలు విడుదల చేసింది. దీంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి 1.53 లక్షల రూపాయల బోనస్‌ ఇవ్వనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న మొత్తం 42 వేల మంది కార్మికులకు 1.53లక్షల రూపాయల చొప్పున బోనస్‌ అందనుంది. దీంతో పాటు ఒకట్రెండు రోజుల్లో సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్‌ కూడా చెల్లించనున్నట్టు అధికారులు చెప్పారు.