Newspillar
Newspillar
Saturday, 21 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

కొల్లాపూర్ రిపోర్ట్- కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, సీనియర్ నాయకుడు సీ జగదీశ్వర్ రావు కొల్లాపూర్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన జగదీశ్వర్ రావుకు పార్టీలో నిరాశే ఎదురైంది. మొన్న పార్టీలోకి వచ్చిన జూపల్లి కృష్ణా రావుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో జగదీశ్వర్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన జగదీశ్వర్ రావు కోల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజల పట్ల తనకున్న నిబద్దత, కొల్లాపూర్ ప్రజల మద్దతుతో తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ఈ సందర్బందా జగదీశ్వర్ రావు ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజ్లలో ఉండే నాయకుడిగా పేరున్న జగదీశ్వర్ రావు గెలుపు ఖాయమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస పార్టీ చేసిన సర్వేలో సైతం జూప్లలి కృష్ణా రావు కంటే జగదీశ్వర్ రావుకే ప్రజలు ఎక్కువ మద్దతు ఇచ్చారని తెలుస్తోంది.