
స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయ్యి, రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి దాదాపు 50 రోజులు కావస్తోంది. తనపై పెట్టిన కేసు అక్రమమని, తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టులో పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి సైతం చంద్రబాబు కోసం పోరాటం చేస్తూనే ప్రజల్లోకి వచ్చారు. ఐతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh) మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాదాపు 50 రోజుల నుంచి దేవాన్ష్ తన తాత చంద్రబాబును చూడనే లేదు. ఐతే తాత గురించి అమ్మ బ్రాహ్మణి, నానమ్మ భువనేశ్వరిని (Bhuvaneshwari) అడిగిన దేవాన్ష్ కు ఆయన విదేశాలకు వెళ్లారని, త్వరలోనే వస్తారని అబద్దం చెప్పారట.
దీంతో తాత జైలుకు వెళ్లిన సంగతి తెలియని దేవాన్ష్ నిజంగానే తాత చంద్రబాబు ఫారెన్ కు వెళ్లారని అనుకుంటున్నాడట. హైదరాబాద్ లో ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లివస్తున్న దేవాన్ష్.. తాత విదేశాలకు వెళ్లినా.. కనీసం తనతో ఫోన్ లో కూడా మాట్లాడటం లేదనే అనుమానాన్ని సైతం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. వరుస సమావేశాలతో తాతా బిజీగా ఉన్నారని, అక్కడి నుంచి నేరుగా నీ దగ్గరకే వస్తాడని బ్రాహ్మణి (Nara Brahmani) సర్దిచెప్పారని సన్నిహితుల చెబుతున్నారు. అటు జైలులో ఉన్న చంద్రబాబు సైతం కుటుంబ సబ్యులు ములాఖత్ కు వెళ్లిన ప్రతిసారి ముందు మనవడు దేవాన్ష్ ఎలా ఉన్నారని అడుగుతున్నారని తెలుస్తోంది. రాజకీయాలు, కోర్టు కేసులు పక్కనపెడితే.. తాతా, మనవడికి ఇది నిజంగా ఎడబాటనే చెప్పాలి. Chandrababu Grandson Nara Devansh