Newspillar
Newspillar
Friday, 27 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

అనంతపురం రిపోర్ట్- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) మళ్లీ ముఖ్యమంత్రి ఐతే చంద్రబాబు చావడం ఖాయమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో జరిగిన సాధికార బస్సు యాత్ర నేపధ్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాధవ్ ఈ కామెంట్ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాధవ్. ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో తన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జ్ కు లేఖ రాసిన నేపధ్యంలో, ఇలా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు చావడం ఖాయమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.