Newspillar
Newspillar
Friday, 27 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) సతీసమేతంగా (Anna Lezhneva) ఇటలీకి (Italy) వెళ్లారు. మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహం నవంబర్‌ 1న ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి వెడుక కోసమే పవన్‌ కళ్యాణ్ ఇటలీ బయలుదేరారు. వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఉపాసన ఇటలీకి చేరుకున్నారు. ఇక కాబోయే వధూవరులు వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి సైతం శుక్రవారం ఇటలీ వెళ్లారు. మరోవైపు మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ సభ్యులు కూడా శనివారం ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇటలీలో ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో ప్రారంభించి, అక్టోబర్ 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న ఘనంగా వివాహ వెడుక జరగనుంది. ఇక ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్ లో నవంబర్‌ 5న సినీ పరిశ్రమలోని ప్రముఖుల కోసం  రిసెప్షన్‌ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా #Varunlav అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విట్టర్-ఎక్స్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి భార్యతో కలిసి ఇటలీకి వెల్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. పవన్ న్యూ లుక్‌ బాగుందని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.