Newspillar
Newspillar
Saturday, 04 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తెలుసు కదా.. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. సినిమాల్లో బిజీగా ఉండటంతో జబర్ధస్త్ తో పాటు మిగతా షోలకు సైతం గుడ్ బై చెప్పేసింది అనసూయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ.. తాను పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చిందని చెప్పిన అనసూయ.. అందులో ఇంకా చాలా మంది హీరోయిన్స్‌ ఉడటంచో ఆ పాటలో నటించనని చెప్పినట్లు తెలిపింది. గుంపులో ఒకరిగా నటించడం తనకు నచ్చదని, తనకంటూ కొంత ప్రత్యేకత ఉండాలని కోరుకున్నానని, అందుకే ఆ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది అనసూయ. ఐతే ఆ పాటలో నటించే అవకాశం ఇచ్చిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సారీ చెప్పినట్లు తెలిపింది అనసూయ.