Newspillar
Newspillar
Wednesday, 08 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

ఆర్మూర్ రిపోర్ట్- బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) కు తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్‌ ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై ప్రయాణీస్తున్న క్రమంలో వాహన డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో కేటీఆర్‌ కింద పడబోయారు.

ప్రచార వాహన డ్రైవర్ సడన్‌ బ్రేక్‌తో వాహన రెయిలింగ్‌ ఊడిపోవడంతో కేటీఆర్ కిందపడ్డారు. అప్రమత్తమైన కేటీఆర్‌ భద్రతా సిబ్బంది ఆయనను క్రింద పడిపోకుండా పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనంపైనుంచి కేసీఆర్ తో పాటు ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌ రెడ్డి కూడా కింద పడిపోయారు. ఆర్మూర్‌ లోని పాత ఆలూర్‌ రోడ్డు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పారు.