Newspillar
Newspillar
Friday, 08 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth) ప్రజా దర్బార్‌ (Praja Darbar) ను మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ లో ప్రజా దర్బార్ ను ప్రారంభించారు. ప్రజా భవన్ దగ్గరకు వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుని వాటిని పరిశీలించారు. వారి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు రేవంత్‌ రెడ్డి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని వారి వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు.