Newspillar
Newspillar
Friday, 08 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- మంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy CM) మంత్రిత్వ శాఖలను కేటాయించారు. శుక్రవారం దిల్లీ వెళ్లిన సీఎం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత మంత్రిత్వ శాఖలపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు శనివారం మంత్రులకు సంబందించిన శాఖలను అధికారికంగా ప్రకటించారు. 

మంత్రుల శాఖలు...
మల్లు భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
సీతక్క - పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత
జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌, పర్యాటకం
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాలు
దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్‌ - రవాణా, బీసీ సంక్షేమం

ఐతే పురపాలక, హోం, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు.