Newspillar
Newspillar
Sunday, 31 Mar 2024 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈఈ సమావేశంలో పోలీసు శాఖ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని సీఎస్ ఆదేశించారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలని సూచించారు. డబ్బు అక్రమ రవాణా తదితర అంశాలపై ఇతర రాష్ట్రాల అధికారులతోనూ సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ రవి గుప్తా సీఎస్‌ శాంతి కుమారికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం 85 బార్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఫ్లెయింగ్ స్క్వాడ్‌  టీమస్ ను ఏర్పాటు చేశామన్న డీజీపీ, గత 15 రోజుల్లో 35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు సరిహద్దు చెక్‌ పోస్టుల్లో 5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వాణిజ్య పన్నుల కమిషనర్‌ సీఎస్‌ శాంతి కుమారికి వివరించారు.