Newspillar
Newspillar
Tuesday, 16 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

ఆయోధ్య రిపోర్ట్- అయోధ్య రామ మందిరంలో (Ayodhya Ram Mandir) ఈసారి శ్రీరామ నవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శ్రీరామ నవమి రావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. బాల రాముడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. సందర్భంగా ఆయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాల రాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకం (Surya Tilak) ను తిలకించి భక్తులు పరవశించిపోయారుఅత్యాధునిక టెక్నాలజీ సాయంతో సూర్యకిరణాలు రామాలయ గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించగా.. ఆధ్బుతమైన దృశ్యం భక్తులకు కనులవిందు చేసింది.

ఆయోధ్య రామాలయంలోని మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రమ సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు నిపుణులుఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ప్రత్యేకంగా ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి బాలరాముడి నుదుటిపై పడి తిలకంగా కన్పించింది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు.