Newspillar
Newspillar
Thursday, 02 May 2024 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి (Shamshabad Airport) వచ్చిన చిరుత (The Cheetah) ఎట్టకేలకు చిక్కింది. ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడానికి ఎయిర్ పోర్ట్ లో ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో గత గురువారం రాత్రి బోనులో చిక్కింది చిరుత. చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూపార్కులో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ఆ తరువాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.