Newspillar
Newspillar
Wednesday, 08 May 2024 00:00 am
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ట్రంప్ (Donald Trump)తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్ (Stormy Daniels)స్పష్టం చేసింది. విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు (Hush Money) సైతం ఇచ్చారని ఆమె చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి డొనాల్ట్ ట్రంప్అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై న్యూయార్క్కోర్టులో విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇంకా ఆమె ఏంచెప్పారంటే.. 2006 లో జరిగిన గోల్ఫ్టోర్నమెంట్లో డొనాల్ట్ ట్రంప్ను మొదటిసారి కలిశాను. తరువాత తన వ్యక్తిగత సిబ్బంది ఒకరి ద్వారా ట్రంప్ ఓ రోజు నన్ను డిన్నర్కు ఆహ్వానించారు. డిన్నర్ చేసిన తరువాత ట్రంప్ నన్ను హోటల్సూట్కు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరం చాలా సేపు ఏకాంతంగా గడిపాము. ఐతే తరువాత చాలా సార్లు ట్రంప్ ను కలిసినప్పటికీ అతనితో ఏకాంతంగా గడపలేదు. ట్రంప్ కు నాకు ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలుసు.. అని స్టార్మీ డేనియల్కోర్టుకు చెప్పుకొచ్చారు.