Newspillar
Newspillar
Tuesday, 07 May 2024 18:30 pm
Newspillar

Newspillar

తెలంగాణ రిపోర్ట్- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణలో పర్యటించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత మోదీ కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోడె మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్బంగా ఆలయ పండితులు ప్రధానికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. మోదీని చూసేందుకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.