Newspillar
Newspillar
Thursday, 09 May 2024 00:00 am
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- విద్యార్థులకు బుద్దిగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ దారితప్పింది. తన వద్ద పాఠాలు నేర్చుకొంటున్న స్టూడెంట్స్ పైనే ఆమె కన్నేసింది. తనకంటే వయస్సులో చిన్నవాడైన విద్యార్థిని లొంగదీసుకొందిఆ స్టూడెంట్ తో తన లైంగిక వాంఛలు తీర్చుకొంది. అదికాస్త వివాదాస్పదమవ్వడంతో కోర్టుకు చేరింది. ఇప్పుడు సదరు కీచక టీచర్‌ వ్యవహారం బ్రిటన్ లో సంచలనంగా మారింది

బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్‌ (Rebecca Joyness) (30) స్వతహాగా లెక్కల టీచర్. ఈ క్రమంలో 2021లో బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకొంది. సమయంలో 11 అంకెల ఫోన్‌ నెంబర్ లో ఒక అంకె తప్ప మిగిలినవి చెప్పి తన మొబైల్‌ నెంబర్‌ కనుక్కోవాలని ఆ బాలుడికి ఛాలెంజ్‌ విసిరింది. తరవాత వారిద్దరి మధ్య మొబైల్ చాట్ తో మొదలైన బంధం బలపడింది. ఒక రోజు బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన టీచర్ ఏకంగా 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్‌ కొనిచ్చింది.

తర్వాత తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి ఆ స్టూడెంట్ ను మచ్చిక చేసుకుంది. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. విషయాన్ని ఆ బాలుడు తన ఫ్రెండ్స్ కు చెప్పడంతో అది కాస్త పోలీసులకు చేరింది. దీంతో టీచర్ జాయ్‌నెస్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడికి బెల్ట్ కొనిచ్చే దృశ్యాలు సీసీటీవీ నుంచి సేకరించారు. కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిందిఇప్పుడీ ఘటన బ్రిటన్ లో సంచలనం సృష్టిస్తోంది.