Newspillar
Newspillar
Wednesday, 08 May 2024 18:30 pm
Newspillar

Newspillar

ఏలూరు రిపోర్ట్- ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ (Here Venkatesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు వెంకటేశ్. కైకలూరు (Kaikaluru) కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ సర్కల్ వరకు వెంకటేశ్‌ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని వెంకటేశ్‌ అన్నారు. ఇక వెంకటేశ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.