Newspillar
Newspillar
Thursday, 09 May 2024 00:00 am
Newspillar

Newspillar

సినిమా పోస్ట్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కు సినీ రంగం నుంచి రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం ప్రజలు ఆయనను గెలపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) సైతం పవన్‌ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్-ఎక్స్‌ వేదికగా పోస్ట్‌పెట్టారు అల్లు అర్జున్.

ట్విట్టర్ పోస్ట్ లో అల్లు అర్జున్ ఏంచెప్పారంటే.. పవన్‌ కల్యాణ్‌ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా.. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి.. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు బన్నీ.

అన్నట్లు జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని కూడా ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా.. అని పవన్ కు మద్దతు ఇచ్చారు. అటు మెగాస్టార్ చిరంజీవి వీడియోను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న రామ్‌ చరణ్‌.. భవిష్యత్‌ కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించండి.. అని పోస్ట్‌ చేసి మద్దతు తెలిపారు.

వీళ్లే కాకుండా హీరో రాజ్, తేజ సజ్జా, సంపూర్ణేష్‌ బాబు సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించగా.. వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హాస్య నటులు ఆది, గెటప్‌ శ్రీను తదితరులు పవన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.