Newspillar
Newspillar
Tuesday, 09 Jul 2024 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్-ఢిల్లీ రిపోర్ట్- భారత దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఐఆర్‌ఎస్‌ అధికారి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్చుకున్నారు. పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించింది సదరు మహిళా ఐఆర్ఎస్ అధికారిణి. చెన్నైకి చెందిన ఐఆర్ఎస్ అధికారణి ఎం.అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌ గా పనిచేస్తోంది. ఐతే తన పేరును ఎం.అనుకతిర్‌ సూర్యగా పేరుతో పాటు లింగాన్ని స్త్రీకు బదులుగా పురుషుడిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అనసూయ. 

ఐఆర్ఎస్ అధికారిణి అనసూయ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మాకు ఓ విన్నపం వచ్చింది.. 2013 బ్యాచ్ కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని CESTAT చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్చాల్సిందిగా అభ్యర్థించారు.. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాము.. అని పేర్కొంది ఆర్ధిక మంత్రిత్వ శాఖ. 

చెన్నైకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ (M Anusuya) చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 2013లో చెన్నెలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌ కు ప్రమోషన్ పొందారు. 2023లో భోపాల్‌ లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. గత సంవత్సరం 2023లో హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్  కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పుడు ఇలా పురుషుడిగా రికార్డుల్లో మార్పు చేసుకున్నారు. (Anukathir Surya)