
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను (కాటమయ్య రక్ష కిట్లు) లబ్ధిదారులకు అందజేశారు. హైదరాబాద్ ఐఐటీ తయారు చేసిన వీటిని బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు అందించారు. తాటి చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయని సీఎం చెప్పారు. ఇక హయత్ నగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుందని ఈ సందర్బంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మొత్తం 7 కిలోమీటర్ల మేర మెట్రో పోడగిస్తున్నామని, దీని వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు.