శిల్పాశెట్టి దంపతులపై నమోదైన కేసులో 60 కోట్ల డబ్బు ను కనిపెట్టిన పోలీసులు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) దంపతులు ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఆ కేసులో కీలక విషయాలు వెలుగులలోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కీలకమలుపు తిరిగింది. రూ.60 కోట్ల రూపాయల నిధుల మళ్లింపులో నలుగురు కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ కేసుకు సంబందించి వారిని ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసినట్లు ఆర్థికనేరాల దర్యాప్తు విభాగం తెలిపింది. ఈ నలుగురు ఉద్యోగులు కంపెనీలో ఉన్నత పదవుల్లో ఉన్నారని వీరిలో ఒకరు ఇప్పటికే దర్యాప్తునకు హాజరయ్యారని అధికారులు చెలిపారు.
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా (Raj Kundra) చెప్పినట్లు డబ్బును కంపెనీ లావాదేవీల కోసం ఖర్చు చేశారా లేదా అనే అంశాన్ని అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. నిధుల మళ్లింపును కనుగొనడమే లక్ష్యంగా అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే రాజ్‌కుంద్రాను పోలీసులు సుమారు 5 గంటలు విచారించినట్లు సమాచారం. ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. ఓవైపు దీనిపై విచారణ జరుగుతుండగా శిల్పా దంపతులు తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.