chandra babu

నేరచరిత్ర ఉన్న నేతలను రాష్ట్రం నుంచి ఊడ్చేయాలి- సీఎం చంద్రబాబు

తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని, అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) చెప్పారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్న చంద్రబాబు.. ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాలని పిలుపునిచ్చారు. అమరావతిలో క్యాంటమ్ వ్యాలీని నిర్మించి.. ఏఐని అభివృద్ధి చేస్తామని ఈ సందర్బంగా చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని, ప్రఖ్యాత విద్యా సంస్థలు తిరుపతిలో ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ తీసుకురాబోతున్నామని చంద్రబాబు అన్నారు. 

కాలుష్యం లేకుండా గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు. వాతావరణ సమాచారం ముందుగా తెలిసేలా యాప్ తీసుకొస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఆగస్టు 15 నాటికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సర్వీసులు అందిస్తామని తెలిపారు. నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారని ఆవేధన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు.. నేరచరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలని అన్నారు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదని.. ప్రజల భూములను లాక్కొనేందుకు యత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజం, ముఠా కలహాలు, మతకలహాలు నివారించామని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే తనపై అసత్య ప్రచారం చేశారన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉండేనా..అని ప్రశ్నించారు. నేరస్థుల గుండెల్లో నిద్ర పోతానని హెచ్చరించారు.
 


Comment As:

Comment (0)