Aus vs Ind

మూడో వన్డేలో టీమ్‌ ఇండియా ఘన విజయం..రాణించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sydney) వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. సిడ్నీలో టీమ్‌ ఇండియా (Team India),ఆస్ట్రేలియా (Australia vs India) పోటా పోటీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ ముందు బ్యాటింగ్ ఎంచుకుని 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ ఇండియా ఈ లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇక బ్యాటింగ్‌ లో భారత్‌ కు శుభారంభం దక్కింది. రోహిత్‌ శర్మ (121*; 125 బంతుల్లో, 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (74*; 81 బంతుల్లో, 7 ఫోర్లు) అద్భుతంగా రాణించారు.

ముందు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ (Rohit Sharma) మొదటి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద గిల్‌ హేజిల్‌ వుడ్‌ బౌలింగ్‌ లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) తొలి బంతికే తన పరుగుల తడాఖా చూపించాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్‌ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌ లో మాత్రం తన రిథమ్‌ లోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌  కోహ్లీ ధాటికి ఆసీస్‌ బౌలర్లు కళ్లు తేలేశారు. వీరు మూడో వికెట్‌ కు 169 బంతుల్లో 168* పరుగులు జత చేశారు. రెండో మ్యాచ్‌ లో అర్ధ శతకం చేసిన రోహిత్‌ శర్మ ఈ వన్డేలోనూ అద్భుతంగా రాణించి, సెంచరీ (105 బంతుల్లో) చేశాడు. రోహిత్‌ శర్మకు ఓవరాల్‌ గా ఇది 50వ సెంచరీ. వన్డేల్లో అతడికిది 33వ శతకం. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఆ జట్టుపై ఎక్కువ సెంచరీలు (6) చేసింది కూడా రోహిత్‌ శర్మనే. ఆ తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లీ (5 సెంచరీలు) ఉన్నాడు.
 


Comment As:

Comment (0)