Vijay

చెన్నై రిసార్ట్‌లో 50 గదులు బుక్‌.. కరూర్‌ బాధితులను కలవనున్న విజయ్‌

తమిళగ వెట్రీ కజగం-టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Thalapathy Vijay) తమిళనాడులోని కరూర్‌ లో నిర్వహించిన ప్రచార ర్యాలీ (Karur Stampede) తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరూర్ ఘటన బాధిత కుటుంబాలను కలవాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలను కలవనున్నట్లు టీవీకే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల అక్టోబర్ 27 సోమవారం చెన్నై సమీపంలోని ఓ రిసార్టులో విజయ్ వారిని పరామర్శించనున్నారు.

కరూర్ ఘటన బాధిత కుటుంబాలకు కలిసేందుకు టీవీకే పార్టీ సదరు రిసార్టులో మొత్తం 50 గదులను బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఒక్కో బాధిత కుటుంబాన్ని విజయ్ వ్యక్తిగతంగా కలిసి సంతాపం తెలియజేస్తారని అర్దమవుతోంది. వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించాలని విజయ్ భావించినప్పటికీ.. అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు పార్టీ తెలిపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని ముందు వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. 
 


Comment As:

Comment (0)