marriage

ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు

ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు.. అక్కడే వరుడి తమ్ముడితో 

నేషనల్ డెస్క్- అప్పుడప్పుడు సినిమాల్లో మాదిరిగా వివాహవేడుకల్లో భలే గమ్మత్తులు జరుగుతుంటాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌ జిల్లాలో పెళ్లి తంతులో ఇలాగే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఓ యువతి అప్పుడే జరిగిన పెళ్లిని కాదని, అక్కడే పెళ్లికొడుకు తమ్ముడిని పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏంజరిగిందంటే.. పెళ్లి కొడుకు మన దేశ ప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో అతనితో పెళ్లినే రద్దు చేసుకుంది యువతి.  ఘాజీపూర్ కు చెందిన 27 ఏళ్ల వశంకర్‌ కు జూన్‌ 11న రంజన అనే యువతితో  వివాహం జరిగింది. అంతకు ముందు ఆరు నెలల క్రితం వీరిద్దరి వివాహం నిశ్చయమైంది.  పెళ్లి జరిగిన మరుసటి రోజు జూన్‌ 12న ఉదయం పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. 

ఆ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరని మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేక నీళ్లునమిలాడు. అక్కడే ఉండి ఇది చూసిన వధువు బంధువులు అతణ్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన పెళ్లి కూతురు శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు. పెళ్లి కూతురు చేసిన పనికి ఇరు వర్గాల బంధువులతో పాటు పెళ్లి కొడుకు అవాక్కయ్యారు. ఆ తరువాత పెళ్లి కూతురుకు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆమె ససేమిరా అంది.
 


Comment As:

Comment (0)