Latest News

టిఆర్ఎస్ ల‌ఫంగ‌ల‌కు భూముల వివ‌రాలు ఇవ్వొద్దంటున్న రేవంత్ రెడ్డి..!
హైద‌రాబాద్ : కేసిఆర్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌మ‌గ్ర భూస‌ర్వేపై నిప్పులు చెరిగారు టిడిపి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ భూస‌ర్వే కోసం ఏర్పాటు చేస్తున్న రైతు స‌మితులు రైతుల‌ను పీల్చుకు తినేందుకు త‌ప్పా దేనికి ప‌నికిరావ‌ని ద్వ‌జ‌మెత్తారు. టిఆర్ఎస్ లో ప‌నిపాట లేని ల‌ఫంగ గాళ్ళ‌నంతా ఈ రైతు స‌మితుల్లో వేస్తున్నార‌ని ..  రైతు స‌మితుల పేరుతో  కేసిఆర్ త‌యారు చేస్తున్న న‌యా ర‌జాక‌ర్ల సైన్య‌మ‌న్నారు. కేసిఆర్ నియ‌మిస్తున్న ఈ ల‌ఫంగ‌ల చుట్టూ రైతులు తిర‌గాలా అంటూ ప్ర‌శ్నించారు రేవంత్ . ముఖ్య‌మంత్రి కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం .. రెవెన్యూ శాఖ‌ను నిర్విర్యం చేసి టిఆర్ఎస్ నేత‌ల‌ను క్రియాశీలం చేయ‌డం త‌ప్పా మ‌రొక‌టి కాద‌న్నారు. ఈ రైతు స‌మితులు రైతుల నుంచి మామూళ్ళు వ‌సూలు చేయ‌డానికేన‌న్న రేవంత్ .. ఇలాంటి చెత్త నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్న కేసిఆర్ కు .. రైతులు త‌గిన బుద్ది చెప్పే స‌మ‌యం ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. రైతులెవ‌రూ టిఆర్ఎస్ ల‌ఫంగ గాళ్ళ‌కు త‌మ భూముల వివ‌రాలు ఇవ్వొద్ద‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం కేసిఆర్ కొత్త నాటకానికి తెర లేపారని విమ‌ర్శించిన రేవంత్ .. కేసిఆర్ కు సంఖ్యా శాస్త్రం పిచ్చి ముదిరిందన్నారు.గ‌తంలో కేసిఆర్ హ‌డావిడిగా చేప‌ట్టిన మన ఊరు మన ప్రణాళిక ఎటుబోయింద‌న్న ఆయ‌న .. 3 సంవత్సరాలు గడుస్తున్నా దిక్కు మొక్కు లేద‌న్నారు. ఇక ఈ కోవ‌లో చేప‌ట్టిన .. సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను భయబ్రాంతుల‌కు గురిచేసిన విష‌యాన్ని రేవంత్ గుర్తు చేశారు. గ్రామ జ్యోతి పథకంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామ‌ని  గొప్పలు చెప్పిన కేసిఆర్ స‌ర్కారు ..  పంచాయతీలకు కనీస నిధులు కూడా ఇవ్వకుండా కాలం వెళ్ళ‌దీస్తున్న విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. ఇక కేసిఆర్ క్యాబినెట్ మంత్రులంతా చెప్రాసిలుగా మారార‌ని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి .. వెంట‌నే జీవో నెంబ‌ర్ 39 ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక తాను మాట్లాడిన విష‌యాల్లో ఏమైనా త‌ప్పులుంటే కేసులు వేసుకోవ‌చ్చిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. మ‌రి గులాబీ బాస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ స‌వాల్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
కలిచివేస్తున్న చిన్నారి సూసైడ్ లెటర్
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది.నిజాంసాగర్ మండల కేంద్రంలో బ్లూ బెల్స్ హై స్కూల్ లో ఆరో తరగతి చదివే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారి రాసిన సూసైడ్ లెటర్ హృదయాన్ని పిండేస్తోంది.   రేపటిరకు హోంవర్క్ పూర్తి చేయకుంటే ప్రిన్సిపల్‌ వద్దకు తీసుకెళ్తానని సోషల్ టీచర్ అన్నాడు. ఇంట్లో వాల్లు కూడా నన్ను అనవసరంగా తిడుతున్నారు అందుకే చనిపోతున్నాను అని లేఖలో పేర్కొంది. ఈ సంఘటన బుధవారం జరిగిననా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసి తెలియని 11 సంవత్సరాల్లో చిన్నారి ఆత్మహత్య చేసుకోవటం అందర్ని కలిచివేసింది.
బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించిన నాని, సాయి పల్లవి
వరంగల్ : హీరో నాని, ఫిదా హీరాయిన్ సాయి పల్లవి బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించారు. అదికూడా వరంగల్ టౌన్ లో. అందరిముందే సాయి పల్లవిని వెనకాల కూర్చోబెట్టుకొని యమహా ఆర్ ఎక్స్ బైక్ ను రేజ్ ఇస్తూ ముందుకు దూసుకుపోయాడు.   అయితే ఇదంతా సినిమా షూటింగ్ అట. వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న " ఎంసీఏ " మూవీ కి చెందిన కొన్ని సీన్లను చిత్రీకరించారు. షూటింగ్ లో భాగంగా సాయిప‌ల్ల‌విని నాని బైక్ పై తిప్పుతూ చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. ఇది తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమ అట. ఈ మధ్య ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలు తెలంగాణ నేపత్యంలో వచ్చి హిట్ కావడంతో నాని ఎంసీఏ కూడా తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ తోనే తీస్తున్నారు.
పవర్ స్టార్ ను అంతలా అవమానించాడా..
సినిమా పిల్లర్- ఎప్పుడు వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఈ సారి పవన్ కళ్యాణ్ పై పడ్డాడు. పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు వర్మ . అసలు పవర్ స్టార్ అనే బిరుదు విజయ్ దేవరకొండ కు ఇవ్వాలని.. పవన్ కళ్యాణ్ కంటే పది రేట్లు విజయ్ బెటరని అంటున్నాడు రాంగోపాల్ వర్మ. అంతే కాదు నటనలో పవన్ కంటే విజయ్ దేవరకొండ 20 రేట్లు మెరుగు అని అందుకే రియల్ పవర్ స్టార్ అనే బిరుదు  విజయ్ దేవరకొండ కు ఇవ్వాలని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ . ఇక గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని అదేపనిగా టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురౌతూ వస్తున్నాడు . రాంగోపాల్ వర్మ మరో హీరోని పొగిడితే తప్పు లేదు కానీ అదే సమయంలో  పవన్ కళ్యాణ్ ని ఇందులో విమర్శించడం మరీ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు . మరి రాంగోపాల్ వర్మ మామూలుగానే విజయ్ దేవరకొండను పొగిడాడా... లేక పవన్ ను విమర్శించడానికే ఇలా చేశాడా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ బీసీ అస్త్రం " పొన్నం"
హైద‌రాబాద్ : మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్  కాంగ్రెస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారా..? గులాబి బాస్ క్యాస్ట్  పాలిటిక్స్ కు కాంగ్రెస్ .. పొన్నం తో కౌంట‌ర్ ఇవ్వ‌బోతుందా..? బీసీ కార్డ్ కు టిసెంటిమెంట్ ను మిక్స్ చేసి గులాబి ద‌ళ‌ప‌తిని హ‌స్తం పార్టీ ఢీ కొట్ట‌బోతుందా..? అవును నిజ‌మే అంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తుండ‌టంతో ఇప్ప‌డి నుండే అల‌ర్ట్ అయిన కాంగ్రెస్ ప‌క్కా స్కెఛ్ తో ముందుకెళుతుంది. ఒక వైపు పార్టీలోని బిసి త‌మ‌కు ప్రాదాన్య‌త క‌ల్పించాల‌ని నేత‌ల స్వ‌రం పెంచ‌డం.. మ‌రోవైపు గులాబి బాస్ తెర‌పైకి తెస్తున్న క్యాస్ట్ పాలిటిక్స్ తో  త‌రుముకొస్తున్న‌ ప్ర‌మాదాన్నిప‌సిగ‌ట్టిన కాంగ్రెస్ పార్టీ.. వేగంగా త‌మ ప్ర‌ణాళిక‌ను లైన్ లో పెట్టేందుకు రెఢీ అయ్యింది. జ‌నాభాలో 50 శాతంకు పైగా ఉన్న బిసీలో 2019లో కీలకంగా మారనుండ‌టంతో కేసీఆర్ .. ఇప్ప‌టికే గొర్లు, బ‌ర్లు, చేప‌లు, ఇలా బీసీ కులాల‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తూ వారిని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు. దీన్నిగ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ గులాబి బాస్ ఫ్యూహానికి కౌంట‌ర్ గా కూడా బీసీ కార్డ్ ను విస‌ర‌బోతుంది. ఈ అస్త్రంలో భాగంగానే మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ ను మ‌రో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా రంగంలోకి దింపేందుకు రెఢీ అయ్యింది. ప్ర‌స్తుతం పీసీసీ ఛీఫ్ గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క ఉన్నారు. వీరికి అద‌నంగా ఇప్పుడు పొన్నం ప్ర‌భాక‌ర్ ను మ‌రో కొత్త సేనానిగా దీంచాల‌ని కాంగ్రెస్ భావిస్తుంద‌ని సమాచారం. దీనిపై ఇప్ప‌డికే చాలా క‌స‌ర‌త్తు చేసింద‌ట‌. ఈ ప‌ద‌వి కోసం దానం నాగేంద‌ర్, డాక్ట‌ర్ విన‌య్ తో  క‌లుపుకుని ఓ అర‌డ‌జ‌న్ మంది రేస్ లో ఉన్నా రాహుల్ మాత్రం పొన్నం వైపే మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తుంది . అయితే పొన్నం ప్రొఫైల్ కు మిగ‌తా వారు ద‌రిదాపుల్లో లేక పోవ‌డం పొన్నం కు ప్ల‌స్ గా మారింద‌ట‌.  ఎన్ ఎస్ యూఐ నుండి కాంగ్రెస్ లో ప‌నిచేస్తు వ‌స్తున్న పొన్నం ప్ర‌భాకర్.. ఎంపీగా ఉండి తెలంగాణ విష‌యంలో అదిష్టానంను ఒప్పించ‌డంలో  అలుపెర‌గ‌ని పోరాటం చేయ‌డం., తెలంగాణ బిల్లు పాస్ స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి పిప్ప‌ర్స్ స్ప్రే ను అడ్డుకోవ‌డం, గాయ‌ప‌డ‌టం.. తెలంగాణ‌లో పొన్నంకు ఇమేజ్ ను పెంచింది. ఇప్ప‌డికి కూడా తెలంగాణ విష‌యంలో కేసీఆర్ తో స‌హా.. టిఆర్ఎస్ నేత‌లు ఎవ‌రు కూడా పొన్నం వేలేత్తి చూప‌లేని ప‌రిస్తితి. దీనికి తోడు.. ఏ అంశాన్ని అయినా సూటిగా చెప్ప‌గ‌ల‌గ‌డం.. అందునా టిఆర్ఎస్ కు ప‌ట్టున్న క‌రీంన‌గ‌ర్ చెందిన వ్వ‌క్తి కావ‌డంతో ఉత్త‌ర తెలంగాణ ప్రాధ‌న్య‌త క‌ల్పించిన‌ట్లు అవుతుంద‌న్న‌ది హ‌స్తం పార్టీ భావ‌న‌. వీట‌న్నింటికి తోడు న‌వ‌త‌రం బీసీ నాయ‌కుడు కావ‌డం.. అందులోను బీసీలో బల‌మైన గౌడ సామాజిక వ‌ర్గం నేత గా ఉన్న‌పొన్నం రైట్ ప‌ర్స‌న్ అని రాహుల్ గాంధి భావిస్తున్న‌ట్లు స‌మాచారం. వీటికి తోడు కాంగ్రెస్ అదిష్టానానికి విధేయ‌త కూడా పొన్నంకు క‌లిసివ‌చ్చే అంశంగా నేత‌లు అనుకుంటున్నారు. ఉత్త‌మ్, భ‌ట్టివిక్ర‌మార్కల‌తో పాటు పొన్నం ను క‌లుపుకుని.. ఓసీ-బీసీ-ఎస్సీ ఫార్ములాతో 2019ఎన్నిక‌ల్లో వెళ్లి గులాబి బాస్ కు చుక్క‌లు చూపించాల‌ని త‌హ త‌హ‌లాడుతుంది హ‌స్తం పార్టీ. ఉత్త‌మ్, భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం  ఈముగ్గురికి కూడా ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు లేక పోవ‌డం.. మ‌రో వైపు సామాజీక స‌మ‌తుల్య‌త.. ఇంకోవైపు బీసీ కార్డ్ కాకుండా.. టి సెంటిమెంట్ ట్రంప్ కార్డ్ గా పొన్నంతో ఢీ కొట్టాల‌న్న‌ది కాంగ్రెస్ ఫ్యూహం. మ‌రీ ఈ ప్లాన్స్ ఎంత వ‌ర‌కు కాంగ్రెస్ ల‌కు వ‌ర్కౌట్ అవుతాయో చూడాలి.
వైఎస్ జగన్‌పై కేసు పెట్టండి..సీఈసీ.
న్యూఢిల్లీ: నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మీద జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఆయ్యింది. జగన్‌ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. నంద్యాల ఎన్నికల ప్రచారంలో.. సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీఈసీ తెలిపింది. జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయ స్పష్టం చేసింది. జగన్‌ వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జగన్‌పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ అధినేతకు కొత్త చిక్కు ఎదురైంది.                        
గులాబీ ఎమ్మెల్యేల‌పై నిఘా ..!
హైద‌రాబాద్ : గులాబీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ నిఘా పెంచారు. వారి పనితీరు .. ప్రజల్లో వారికున్న పేరు .. వారి వ్యవహరాలన్నింటిపై కన్నేసే విధంగా ప్ర‌త్యేక ఇంటిలిజెన్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల మీద కేసీఆర్ ఇప్పటికే పలు ధపాలు సర్వేలు నిర్వహించిన విష‌యం తెలిసిందే . సర్వేల్లో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు కూడా . అయినా చాలా మంది ఎమ్మెల్యేలో మార్పు రాలేదు. పైగా చాలా మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు పెరిగాయి. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత పోరు అధికమయ్యింది. లీడర్ .. కాడర్ మద్య కీచు లాటలు పెరిగాయి. ఎమ్మెల్యే .. ఎంపీల మద్య గ్యాప్ కూడా పెరిగింది. ఇదంతా  పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతోంద‌ని కేసిఆర్ భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించేందుకు ప్ర‌త్యేక పోలీసులతో షాడో టీం లను ఏర్పాటు చేసారు. పార్టీ  ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు .. ఏలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాలను ఎప్పటి కప్పుడు ఇంటలిజెన్స్ పోలీసులు ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంటారు. ప్రాథమికంగా ప్రజల నుంచి సమాచారం సేకరించకుండా..అధికారిక కార్యక్రమాలనే కవర్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా సెకండరీ సోర్స్ లనే నమ్ముకుని పనిచేస్తారు. అయితే ఇప్పడు సీఎం ఏర్పాటు చేసిన షాడో టీంలు కేవలం ఎమ్మెల్యేలను ఫాలో చేయడానికే పరిమితం కాకుండా...ప్రజలతో మమేకమవుతూ ఎమ్మెల్యేల పని తీరుపై సమాచారాన్ని సేకరిస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హమీలను ఎంత మేర నేరవేరుస్తున్నారు, ఆయన పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, ఎమ్మెల్యేల పాసిటివ్స్ ఏంటీ, నెగెటీవ్స్ ఏంటీ అన్న అంశాలను క్రోడికరించి నివేదికలు రూపొందించే భాద్యతలను ఈ షాడో టీంలకు అప్పజెప్పారు. దీంతో పాటు నియోజవర్గాల్లో పార్టీల బలబలాలు ఏలా ఉన్నాయి, మండలాల వారిగా గెలుపోటములను ప్రభావితం చేసే వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ నివేదికలకకు అనుగుణంగా గెలిచే అభ్యర్ధులకు వచ్చే ఎన్నికల్లో పెద్ద పీఠ వేయాలన్న ఆలోచనలో కేసిఆర్ ఉన్నారు. అందుకే ఎన్నికలకు 20 నెలల సమయమున్నా..ఎమ్మేల్యే పనితీరు, నియోజకవర్గాల వారిగా పార్టీల బలా బలాలను నివేదించేందుకు షాడో టీంల ద్వ‌రా సేక‌రిస్తున్నారు గులాబీ బాస్.  ఈ షాడో టీంలను డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి సీఐలు, ఎస్సై కాడర్ అధికారులు ఉండేలా డీఎస్పీలకు అనుమతులిచ్చారు. ఇప్పటికే ఈ టీంలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల్లో గుబులు పెరిగింది. ఓ వైపు సీఎం సర్వేలు .. మరో వైపు షాడో టీంల సమాచార సేకరణతో నియోజకవర్గాలనే పట్టుకు వేలాడుతున్నారు. నియోజకవర్గ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. షాడో టీంలు ఏవరిని కలిసి ఏం అడుగుతారో అన్న భయంతో అందరితో ఎమ్మెల్యేలు మంచిగా ఉండేలా చొరవ చూయిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
త్రిపుల్ తలాక్ చెల్లదన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ. : ట్రిపుల్ తలాక్ చెల్లుతుందా.. చెల్లదా.. అన్న సస్పెన్స్ తెరదించింది సుప్రీంకోర్టు. త్రిపుల్ తలాక్ చెప్పి భార్యను వదిలించు కోవడం అత్యంత హేయ్యమైన చర్యగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. త్రిపుల్ తలాక్ చెల్లదని తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయంలో పార్లమెంట్ లో ఓ చట్టం చేయాల్సి వుందని, అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం చేసేంత వరకూ తమ ఆర్డర్ అమలవుతుందని పేర్కొంది. అసలు కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదని, అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నట్టు తెలిపింది.. ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పిచ్చింది.   సుదీర్ఘకాలంగా వాదనలు విన్న న్యాయస్థానం, ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని, ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో నూతన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. ఇన్ స్టంట్ గా మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అటువంటివి చెల్లబోవని పేర్కొంది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది. మొత్తానికి సుప్రీమ్ తీర్పుతో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కేటిఆర్ గురించి పార్టీ ఎమ్మెల్యేల్లో ఇలాంటి అభిప్రాయ‌ముందా ..!
హైద‌రాబాద్ : తెలంగాణ  ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు రాజ‌కీయ వార‌సుడు ఎవ‌రు అంటే ఇంకెవ‌రూ .. కేటిఆర్ అని ట‌క్కున చెప్పేస్తారు టిఆర్ఎస్ నేత‌లు. కేసిఆర్ కూడా అదే త‌ర‌హాలో కేటిఆర్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారు కూడా. కాబోయే ముఖ్య‌మంత్రి కేటిఆరే అని ఆయ‌న స‌న్నిహితులు బ‌లంగా బెప్పుకుంటున్నారు కూడా. హ‌రీశ్ రావుకు ఇష్టం ఉన్నా .. లేకున్నా .. కేసిఆర్ త‌న వార‌సుడిగా 2019లో కేటిఆర్ ను సీఎం సీటుపై కూర్చోబెట్ట‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ గులాబీ పార్టీలో బ‌లంగా ఉంది. అయితే ఇంత‌కీ నేత‌లు పైకి కేటిఆర్ ను భ‌విష్య‌త్తు ముఖ్య‌మంత్రిగా చెబుతున్నా .. ఇంట‌ర్న‌ల్ గా కేటిఆర్ గురించి ఏమ‌నుకుంటున్నార‌నేది కొంత ఆస‌క్తి రేపుతోంది.   ముఖ్య‌మంత్రిగా కేసిఆర్ త‌ప్పుకొని కేటిఆర్ కు సీఎం సీటు క‌ట్ట‌బెడ‌తార‌నేది అంత ఈజీ కాదంటున్నారు పార్టీలోని కొంద‌రు ఎమ్మెల్యేలు. కేసిఆర్ ఎంపిగా వెళ్ళి డిల్లీ రాజ‌కీయాలు చూస్తార‌నేది కూడా జ‌రిగే ప‌నికాదంటున్నారు. సీఎం సీటు కంటే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఏమంత పెద్ద గొప్ప‌కాదు క‌దా .. అలాంట‌ప్పుడు కేసిఆర్ ప‌ద‌విని కొడుకుకు ఎలా క‌ట్ట‌బెడ‌తారు అని ఎమ్మెల్యేల ప్ర‌శ్న‌. ఒక వేళ కేసిఆర్ డిల్లీ వెళ్ళాల్సి వ‌స్తే ప్ర‌ధాని గానో ఉప ప్ర‌ధాని గానో .. థ‌ర్డ్ ఫ్రంట్ చైర్మెన్ హోదానో ఉంటే కానీ వెళ్ళే చాన్స్ లేదంటున్నారు. ఇక అదీ కాక .. తాను త‌ప్పుకొని కొడుకును పీఠ‌మెక్కించేందుకు కేసిఆర్ ఏమీ ములాయం సింగ్ కాదు క‌దా .. మ‌రి అలాంటి త‌ప్పు ఎందుకు చేస్తారు అంటున్నారు.  ఇక మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఎమ్మెల్యేల నోట్లో నుంచి వ‌చ్చింద‌టే .. కేసిఆర్ త‌ప్పుకొని కేటిఆర్ ను ముఖ్య‌మంత్రి చేస్తే .. కేటిఆర్ ఫెయిల్ అవుతార‌ని చెబుతున్నారు. కేసిఆర్ లో ఉన్నంత రాజ‌కీయ చ‌తుర‌త కేటిఆర్ లో లేద‌నేది స‌ద‌రు ఎమ్మెల్యేల అభిప్రాయం.  ఇక వైపు గులాబీ బాస్ త‌న రాజ‌కీయ వ‌ర‌సుడికి ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తుంటే .. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఇలా రివ‌ర్స్ లో అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్ . మ‌రి కేసిఆర్ ఎమ్మెల్యేల మ‌న‌స్సెరిగి న‌డుచుకుంటారో లేక త‌న మ‌న‌స్సులోని నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తారో చూడాలి.

ఆయనతో ఫోన్ లోనే మాట్లాడా.. కానీ త్వరలో..

On Sep 03 ,2017

టిఆర్ఎస్ ల‌ఫంగ‌ల‌కు భూముల వివ‌రాలు ఇవ్వొద్దంటున్న రేవంత్ రెడ్డి..!

On Sep 01 ,2017

కలిచివేస్తున్న చిన్నారి సూసైడ్ లెటర్

On Aug 31 ,2017

బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించిన నాని, సాయి పల్లవి

On Aug 31 ,2017

తమిళనాట రాణీ ఆమెనట..

On Aug 26 ,2017

అందుకోసం ఆమెకు నాలుగు కోట్లా...

On Aug 26 ,2017

కేటిఆర్ గురించి పార్టీ ఎమ్మెల్యేల్లో ఇలాంటి అభిప్రాయ‌ముందా ..!

On Aug 21 ,2017

జనంలో ఆమెకు అంతుందా...

On Aug 21 ,2017

దటీజ్ కామ్రేడ్.. ఈ మేయర్ కు సలాం కొట్టాల్సిందే..

On Aug 21 ,2017

ఇద్దరూ ఒక్కటై..`రెండాకులు`కాపాడుకున్నారు!

On Aug 21 ,2017

అలాంటి సన్నివేశాలకు నేను దూరం..

On Aug 18 ,2017

కమలం పార్టీ వైపు చూస్తున్న డి. శ్రీనివాస్

On Aug 15 ,2017

ఆమెకు మరీ అంత డిమాండా...

On Aug 15 ,2017

1947 అగ‌స్టు 15 న పేప‌ర్లో వ‌చ్చిన వార్త‌లు చ‌దివారా..

On Aug 15 ,2017

మహిళా ఎమ్మెల్యే ను బండబూతులు తిట్టిన టిఆర్ఎస్ లీడర్

On Aug 09 ,2017

అబ్బాయిల మొహం చూసి పెళ్లిచేసుకుంటే...

On Jul 19 ,2017

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

On Jul 19 ,2017

ఆసీస్‌తో సెమీస్‌కు మిథాలీ ‘సైన్యం’ సిద్ధమా!

On Jul 19 ,2017

వీసా ఉంటే అదనపు పత్రాలు అవసరం లేదు!

On Jul 19 ,2017

పూర్ణిమసాయిపై.. టీవీ నటి ప్రభావం!

On Jul 19 ,2017

కెల్విన్‌తో పూరీకి సంబంధంపైనే ఆరా!

On Jul 19 ,2017

ఆయనతో ఫోన్ లోనే మాట్లాడా.. కానీ త్వరలో..

On Sep 03 ,2017

టిఆర్ఎస్ ల‌ఫంగ‌ల‌కు భూముల వివ‌రాలు ఇవ్వొద్దంటున్న రేవంత్ రెడ్డి..!

On Sep 01 ,2017

కలిచివేస్తున్న చిన్నారి సూసైడ్ లెటర్

On Aug 31 ,2017

బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించిన నాని, సాయి పల్లవి

On Aug 31 ,2017

పవర్ స్టార్ ను అంతలా అవమానించాడా..

On Aug 28 ,2017

తమిళనాట రాణీ ఆమెనట..

On Aug 26 ,2017

అందుకోసం ఆమెకు నాలుగు కోట్లా...

On Aug 26 ,2017

కాంగ్రెస్ బీసీ అస్త్రం " పొన్నం"

On Aug 24 ,2017

వైఎస్ జగన్‌పై కేసు పెట్టండి..సీఈసీ.

On Aug 23 ,2017

గులాబీ ఎమ్మెల్యేల‌పై నిఘా ..!

On Aug 22 ,2017

త్రిపుల్ తలాక్ చెల్లదన్న సుప్రీంకోర్టు

On Aug 22 ,2017

కేటిఆర్ గురించి పార్టీ ఎమ్మెల్యేల్లో ఇలాంటి అభిప్రాయ‌ముందా ..!

On Aug 21 ,2017

రామేశ్వ‌ర్ రావు చేతుల్లోకి ఆర్టీసీ ..?

On Aug 21 ,2017

కోదండరాం పై హోం మంత్రి నాయిని సంచలన వ్యాఖ్యలు

On Aug 21 ,2017

test

On Aug 21 ,2017

జనంలో ఆమెకు అంతుందా...

On Aug 21 ,2017

దటీజ్ కామ్రేడ్.. ఈ మేయర్ కు సలాం కొట్టాల్సిందే..

On Aug 21 ,2017

క‌మ‌లం వైపు ఈటెల చూపు ..?

On Aug 21 ,2017

వైఎస్ జ‌గ‌న్ ఎందుకు మ‌తం మారుతున్నారు..!

On Aug 21 ,2017

కేసిఆర్ అభ‌ద్ర‌త‌లో ఉన్నారా ..?

On Aug 21 ,2017

ఇద్దరూ ఒక్కటై..`రెండాకులు`కాపాడుకున్నారు!

On Aug 21 ,2017

లిప్ లాక్ ముద్దులు వద్దంటున్న హనుమంతన్న

On Aug 20 ,2017

0

On Aug 19 ,2017

పొన్నం ప్ర‌భాక‌ర్ దీక్ష‌కు కేసిఆర్ స్పాన్స‌రా .. ?

On Aug 18 ,2017

అలాంటి సన్నివేశాలకు నేను దూరం..

On Aug 18 ,2017

కమలం పార్టీ వైపు చూస్తున్న డి. శ్రీనివాస్

On Aug 15 ,2017

చిన్న పిల్లల మరణం పై అమిత్ షా చిల్లర కామెంట్స్

On Aug 15 ,2017

ఆమెకు మరీ అంత డిమాండా...

On Aug 15 ,2017

1947 అగ‌స్టు 15 న పేప‌ర్లో వ‌చ్చిన వార్త‌లు చ‌దివారా..

On Aug 15 ,2017

గ‌వర్న‌ర్ మాట‌తో.. బిత్త‌రపోయిన ప్ర‌తిపక్ష‌ నేత‌లు

On Aug 15 ,2017

కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లిన కోదండరాం

On Aug 14 ,2017

మహిళా ఎమ్మెల్యే ను బండబూతులు తిట్టిన టిఆర్ఎస్ లీడర్

On Aug 09 ,2017

మరో పే..ద్ద పని పెట్టుకున్న కేసీఆర్

On Aug 08 ,2017

చైన్నై ఎయిర్ పోర్ట్ లో సౌదీ ఎయిర్ లైన్స్ షాక్

On Aug 08 ,2017

ఫిదా కలెక్షన్స్ చూస్తే ఫిదా కాకతప్పదు..

On Aug 08 ,2017

ఫిదా చేస్తున్న ప్రేమమ్ పిల్ల

On Jul 21 ,2017

అబ్బాయిల మొహం చూసి పెళ్లిచేసుకుంటే...

On Jul 19 ,2017

దాన్ని ‘బిగ్‌బాస్‌’ బయటపెట్టింది! ...మధుమిత

On Jul 19 ,2017

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

On Jul 19 ,2017

ఆసీస్‌తో సెమీస్‌కు మిథాలీ ‘సైన్యం’ సిద్ధమా!

On Jul 19 ,2017

వీసా ఉంటే అదనపు పత్రాలు అవసరం లేదు!

On Jul 19 ,2017

గేల్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన సన్నీలియోనీ

On Jul 19 ,2017

పూర్ణిమసాయిపై.. టీవీ నటి ప్రభావం!

On Jul 19 ,2017

కెల్విన్‌తో పూరీకి సంబంధంపైనే ఆరా!

On Jul 19 ,2017

సభ్యసమాజానికి స్ట్రాంగ్ మెసేజ్

On Jun 29 ,2017

10లక్షల డాలర్ల ఫైన్ తో ఇన్ఫోసిస్ సెటిల్ మెంట్

On Jun 24 ,2017

ఎన్టీఆర్.. ఎన్టీఆర్ గా చేయడట!!

On Jun 24 ,2017

డీజేతో రాజు బాగానే వెనకేశాడట

On Jun 08 ,2017

ట్రైలర్ టాక్: ఎలా నచ్చింది సునీల్?

On Jun 08 ,2017

భల్లాలదేవుడి భార్య ఆమేనట

On Jun 07 ,2017

శత్రువులులేని లైఫ్‌ అంటేనే వేస్ట్‌రా

On Jun 07 ,2017

Gallery