Hoescope

రాశిఫలాలు జులై 30 - ఆగస్టు 5

ఈ వారం రాశిఫలాలు - ఎవరి రాశి ఎలా ఉందంటే

స్పెషల్ రిపోర్ట్- ఈ వారం రాశి ఫలాలు (Horoscope Weekly).. ఈనెల జులై 30 నుంచి వచ్చే నెల ఆగష్టు 5 వరకు రాశిఫలాలు (Astrology Weekly) ఎలా ఉన్నాయో చూద్దాం...

మేష రాశి- (Aries) శుభకాలం.. పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్త. ఎవరినీ నమ్మవద్దు. వాస్తవాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోండి. చంచలత్వం పనికిరాదు. ఇంట్లోవారితో కలిసి కార్యాచరణను రూపొందించుకోవాలి. వ్యాపారంలో తప్పుదోవ పట్టించేవారుంటారు. ధర్మం రక్షిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదవండి, త్వరలోనే మంచి భవిష్యత్తు లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)- అదృష్టయోగం సూచితం. ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు. నూతన ప్రయత్నాలు సఫల మవుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. నమ్మకం గెలిపిస్తుంది. బుద్ధిబలంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో మేలు జరుగుతుంది. స్థిరాస్తి వృద్ధిచెందుతుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆంజనేయస్వామిని స్మరించండి, మేలు జరుగుతుంది.

మిధున రాశి (Gemini) అదృష్ట యోగముంది. సంకల్పం నెరవేరుతుంది. ప్రయత్నబలాన్ని పెంచండి. తోటి వారి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాలం వృథా చేయొద్దు. సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. వ్యాపారంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయాలి. ఇతరులపై ఆధారపడవద్దు. సూర్యనారాయణమూర్తి ఆరాధన మేలుచేస్తుంది.

కర్కాటక రాశి (Cancer sign)- ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మార్చుకోవాలి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. స్వయంకృషితో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. దృఢసంకల్పంతో ముందుకెళ్లండి. అదృష్టఫలాలు అందుతాయి. పట్టువిడుపులు అవసరం. ఆత్మీయుల సూచనలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభవార్త వింటారు.

సింహ రాశి (Leo)-  గురుబలం అదృష్టాన్నిస్తుంది. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అధికారులు ప్రసన్నులు అవుతారు. ఓర్పుతో లక్ష్యాన్ని పూర్తిచేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. సహనం కాపాడుతుంది. తొందరవద్దు.పట్టువదలకుండా కృషిచేస్తూనే ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. సొంతనిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు. సూర్యభగవానుని ప్రార్థించండి, శుభం జరుగుతుంది.

కన్య రాశి (Virgo) ఉద్యోగంలో ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. సత్యమార్గంలో పయనించండి. మనోబలంతో విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారానికి ప్రణాళిక సిద్ధంచేసుకోండి. ఆత్మీయులను తప్ప ఇతరుల మాటలు నమ్మవద్దు. ఒక సమస్య తొలగుతుంది. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.

తుల రాశి (Libra) - శ్రేష్ఠమైన కాలం. ఇంటాబయటా కలిసివస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. చేతిలోని పని పూర్తయ్యేవరకూ మరో పని మొదలుపెట్టవద్దు. ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

వృశ్చిక రాశి (Scorpio) - పట్టుదలతో చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. గందరగోళ పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆత్మీయులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. చెడు ఊహించవద్దు. లక్ష్యంపై దృష్టిపెట్టండి. నవగ్రహధ్యానం, ఈశ్వరారాధన చేయండి, మేలు చేకూరుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)- అదృష్టకాలం. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రయత్నబలాన్ని పెంచండి. ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఏకాగ్రతతో పనిచేయండి, అద్భుతమైన విజయం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది. రుణసమస్యలు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి, ఇంట్లో శుభాలు జరుగుతాయి.

మకర రాశి (Capricorn) - ధనయోగముంది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఒత్తిడి ఉంటుంది, అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. అధైర్యపడవద్దు.ముఖ్యకార్యాలను కొంతకాలం వాయిదా వేయవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధపెంచాలి. సమష్టి కృషి మంచిది. నవగ్రహాలను ధ్యానించండి, ఆటంకాలు తొలగుతాయి.

కుంభ రాశి (Aquarius) - ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. బద్ధకించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి. అపార్థాలకు తావు లేకుండా సంభాషించాలి. మంచి ఆలోచనలు అభివృద్ధికి బాటవేస్తాయి. వేంకటేశ్వరస్వామిని దర్శించండి, శుభవార్త వింటారు.

మీన రాశి (Pisces) - సకాలంలో పనులు ప్రారంభించండి, ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. కృషిని బట్టి ఆశయం సిద్ధిస్తుంది. మంచి వ్యాపారయోగముంది. ఖర్చులు పెరుగుతాయి. గౌరవ ప్రతిష్ఠలున్నాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కార్యసాధన మీద దృష్టి నిలపండి. ఆనందించే అంశముంది. ఇష్టదైవస్మరణ శక్తినిస్తుంది.
 
ఇవీ ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాల కోసం ఫాలో అవ్వండి న్యూస్ పిల్లర్ డాట్ కామ్ (Newspillar.com)


Comment As:

Comment (0)