Maruti Invicto

మారుతీ కార్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక రేటు..

మారుతీ సుజుకీ నుంచి కొత్త కారు.. ధర ఎంతంటే

ఆటోమొబైల్ న్యూస్- ప్రముఖ ఆటోమొబైల్ కంపనీ మారుతీ సుజకీ ఇండియా (Maruti Suzuki India) భారతీయ మార్కెట్‌లో బుధవారం మరో కొత్త కారును పరిచయం చేస్తోంది. ఇన్విక్టో (Invicto ) పేరిట మాతో కొత్త వేరియెంట్ ను ప్రవేశపెడుతోంది. మొత్తం  3 వేరియెంట్లు జెటా+ (Zeta+) 7 సీటర్, జెటా+ ( Zeta+) 8 సీటర్, ఆల్ఫా+ (Aplha+) 7 సీటర్‌ తో ఈ కారును విడుదల చేస్తోంది మారుతి సుజుకి. మొదటి వేరియెంట్ ప్రారంభ ధర 24.84 లక్షలు, టాప్ వేరియెంట్ ధర 28.42 లక్షలుగా ధరలు ఉన్నాయి. ఇక మిడిల్ వేరియెంట్ ధర 24.84 లక్షలుగా ఉంది. నెగ్జా బ్లూ, మైస్టిక్ వైట్ సహా 4 రంగుల్లో ఈ కార్లు లభిస్తాయి.

నెగ్జా శ్రేణి కారుల్లో ఇది 8వ మోడల్ కారు కావడం గమనార్హం. మారుతీ సుజుకి నుంచి ఇన్విక్టో (Invicto) మార్కెట్‌ లో సరికొత్త మోడల్ అవనుందని, నెగ్జా ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త మారుతి సుజుకి ఇన్విక్టో కారు 2.0 పెట్రోల్ ఇంజన్, ఒక హైబ్రీడ్ మోటార్‌తో తయారు చేశారు. పెట్రోల్ ఇంజన్ 172 బీహెచ్‌పీ పవర్ జనరేట్ చేయనుండగా.. టార్క్ 188 ఎన్ఎమ్‌గా ఉంది. ఆఫర్‌ పై లభించే వాటిలో ఈ-సీవీటీ యూనిట్ మాత్రమే ఉంది.

కొత్త కారు విడుదలపై మారుతీ సుజుకీ ప్రతినిధి శశాంక్ శ్రీవాస్తవ స్పందించారు. మార్కెట్‌లో కంపెనీ విక్రయాల పెరుగుదలకు కొత్త కారు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 24 శాతం వృద్ధిని ఆశించామన్నారు. మార్కెట్‌లో తమ వాటా పెంచుకోవడమే తమ లక్ష్యమన్నారు. కాగా జూన్ నెలలో మారుతీ సుజుకీ ఇండియా విక్రయాల్లో గతేడాదితో పోల్చితే 8.5 శాతం వృద్ధితో 133,027 యూనిట్లు విక్రయించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నెలకు 61,860 రూపాయల సబ్‌స్ర్కిప్షన్‌తో కూడా ఇన్విక్టో కారును కొనుగోలు చేయవచ్చని మారుతి సుజుకి తెలిపింది.


Comment As:

Comment (0)