PM Modi

పేదలకు ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌- ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది- ప్రధాని మోదీ

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జోస్యం చెప్పారు. బీజేపీ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సభను ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మోదీ.. పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు.. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం.. అని ప్రారంభించారు. మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యానన్న మోదీ.. మీ ఆశీర్వాదంతోనే బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మోదీ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని.. తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ప్రధాని.. తెలంగాణ వచ్చాక బీసీలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్న ప్రధాని.. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల లక్షణాలని అన్నారు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమేనన్న మోదీ.. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీనే అని అన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని చెప్పిన ప్రదాని.. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని కామెంట్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన మోదీ.. పేదలకు ఐదేళ్లపాటు ఉచితంగా బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత రేషన్‌.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సభలో జనసేన ్ధినేత పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు.


Comment As:

Comment (0)