Newspillar
Newspillar
Monday, 03 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ డెస్క్- వివాహం కాని వారికి శుభవార్త. ఇంకా పెళ్లి చేసుకోని వారికి పింఛను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఈ అవకాశం మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాదు. ఈ ఛాన్స్ హరియాణా రాష్ట్రంలో మాత్రమే. ఆవును హరియాణా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని 45 నుంచి 60 ఏళ్ల వారికి పింఛను ఇచ్చేలా కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది హరియాణా సర్కార్. హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్వయంగా ఈ ఫించను పధకం గురించి చెప్పారు. మరో నెల రోజుల్లో ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. 

కర్నాల్‌ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఖట్టర్‌ తో ఓ 60 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తి మాట్లాడుతూ.. పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేధన వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన ఖట్టర్ 45 ఏళ్లు పైబడిన పెళ్లి కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛను ఇచ్చేలా కొత్త పథకాన్ని నెలరోజుల్లోగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. నిజంగా 45 పైబడినా కూడా పెళ్లి కాని వారికి ఈ పింఛను పధకం వారికి ఆర్ధికంగా ఉపయోగంగా ఉంటుంది కదా.