Newspillar
Newspillar
Monday, 10 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

పొలిటికల్ న్యూస్- యునిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Cod) ను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. యూసీసీ వల్ల అన్ని మతాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందని ఆయన అన్నారు. సోమవారం ప్రగతిభవన్ లో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. యూసీసీ ని వ్యతిరేకించాలని ఈ సందర్బాంగా వారు కేసీఆర్ ను కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. 

బీజేపీ ఇప్పటికే చాలా రకాలుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని, ఇప్పుడు యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐక్యతను చీల్చేందుకు కుట్ర జరుగుతోందని, యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నామని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా యూసీసీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే అంశంలోను సహకరిస్తామని అసదుధ్దీన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోది.