Newspillar
Newspillar
Sunday, 30 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్ష్యతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం (Caabinet Meeting) సుధీర్గంగా సాగింది. సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌ (KTR) మీడియాకు తెలిపారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వార 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో కూడిన ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

ఇక ఈ నెల 18 నుంచి 28 వరకు రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలు, వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది.  మొత్తం పది జిల్లాల్లో భారీ వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టంపై సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో చర్చించామని కేటీఆర్ చెప్పారు. వరద నష్టానికి సంబందించి తక్షణ సాయం కింద 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాట్లు కేటీఆర్‌ తెలిపారు.

మరోవైపు వచ్చే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) వ్యవస్థను భారీగా విస్తరించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు టెండర్‌ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో విస్తరణకు సైతం నిర్ణయం తీసుకున్నామని, అటు మియాపుర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీ నగర్‌, ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ మీడియాకు వివరించారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేపడతామని చెప్పిన కేటీఆర్.. ఇక జేబీఎస్‌ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం చేపడతామని తెలిపారు. క్యాబినెట్ లో పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.