Newspillar
Newspillar
Tuesday, 08 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ రోజు (బుధవారం) మహేశ్‌ బాబు పుట్టినరోజు (Mahesh Babu Birthday) సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మహేశ్‌ బాబు లుంగీ కట్టుకుని, బీడీ కాలుస్తూ మాస్‌ లుక్‌ లో కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక చాలా రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై అభిమానుల్లో నెలకొన్న సందేశాలకు చిత్ర బృందం మరోసారి క్లారిటీ ఇచ్చింది. వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం మూవీ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో.. పోస్టర్ ను బట్టి చూస్తే సంగీత దర్శకుడిగా ఆయనే కొనసాగనున్నారని తెలుస్తోంది. 

ఇక మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా కేవలం పోస్టర్‌ మాత్రమే విడుదల చేయడం పట్ల అభిమానులు కాస్త నిరాశచెందారని చెప్పాలి. సినిమా నుంచి ఏదైనా లిరికల్‌ సాంగ్‌, లేదా గ్లింప్స్‌ లాంటిది ఇచ్చి ఉంటే వారి ఆనందం మరో రేంజ్‌లో ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం డైలాగ్‌ టీజర్‌ నైనా విడుదల చేస్తారని ఆశించామని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. గుంటూరు కారం  సినిమాలో మహేశ్‌ బాబు పక్కన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Guntur Kaaram Poster