Newspillar
Newspillar
Tuesday, 15 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

క్రైం రిపోర్ట్- విశాఖపట్నం జిల్లాలో ప్రేమ విఫలమవ్వడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీతంపేటలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం (Mummidivaram) ప్రాంతానికి చెందిన రాంప్రసాద్‌ (30 (Ramprasad)) ఉద్యోగ రీత్యా విశాఖ (Vizag) సీతంపేట గణేశ్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శంకరమఠంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రాంప్రసాద్. అతని ఫ్రెండ్ ద్వారా సమాచారం తెలుసుకున్న ద్వారకా స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతుడు రాసిన సూసైడ్‌ నోట్ లభించింది. ప్రేమ వ్యవహారం కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.