Newspillar
Newspillar
Sunday, 20 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- సీనియర్ నటుడు, మాజీ మంత్రి దివంగత నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) కూతురు నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) తనయుడు హర్ష (Nandamuri Harsha) పెళ్లి వైభవంగా జరిగింది. హైదరాబాద్‌- గచ్చిబౌలిలో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ, వ్యాపారరంగ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హర్ష వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు నందమూరి బాలకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌  రామ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.