Newspillar
Newspillar
Monday, 18 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- వినాయక చవితి (Ganesh Festival) ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా భక్తిశ్రధ్దలతో మొదలయ్యాయి. దేశంలోని కొన్నిప్రాంతాల్లో ఖరీదైన గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు చేశారు. దేశ ఆర్ధిక రాజధఆని ముంబయిలోని (Mumbai) ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ (GSB Seva Mandal) మహాగణపతి ఈ సంవత్సరం సైతం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి వినాయక విగ్రహాన్ని 66.5 కిలోల బంగారు, 295 కిలోలకు పైగా వెండి ఆభరణాలతో అలంకరించారు. అంతే కాకుండా ఈ వినాయక మండపానికి ఏకంగా 360.40 కోట్ల రూపాయలకు బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవామండల్‌ నిర్వాహకులు చెప్పారు.

ఈ సంవత్సరం వినాయక చవితి సందర్బంగా 69వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ సందర్బంగా గణపతి మండపం దగ్గర భద్రతా ఏర్పాట్లలో భాగంగా తొలిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇక ఈ ఖరీదైన గణనాదున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.