Newspillar
Newspillar
Tuesday, 26 Mar 2024 18:30 pm
Newspillar

Newspillar

తెలంగాణ రిపోర్ట్- తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) 1, 2 ముద్దాయిలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేటీఆర్ అనుమతి ఇస్తేనే చేసేవారని ఆయన అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆరేన్న మధుయాష్కి.. వారికీ జైలు శిక్ష పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

హక్కులను కాలారాస్తూ ట్యాపింగ్ చేయడం క్షమించరాని నేరమన్న మధుయాష్కి.. తిండి లేకుండా అయినా బతకవచ్చు గానీ స్వేచ్ఛ లేకుండా బతకలేమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారంతా నక్సలిజం వైపు మళ్లారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ, రెడ్లు రాజ్యమేలితే.. తెలంగాణ వచ్చిన తర్వాత రావులు రాజ్యం ఏలారని మధుయాష్కి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరుగుతోందని చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి తనను పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారని.. ఐతే తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పినట్లు స్పష్టం చేశారు.