Newspillar
Newspillar
Sunday, 21 Apr 2024 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- చాలా రోజుల తరువాత మెగాస్తార్ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాలపై స్పందించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటాన్ని చిరంజీవి స్వాగతించారు. ఇది మంచి పరిణామమన్న చిరంజీవి.. చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నానని, దానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్‌ కళ్యాణ్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనేది తనకున్న పెద్ద కోరిక అని చెప్పుకొన్నారు చిరంజీవి.

అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌ శనివారం హైదరాబాద్‌ లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా ఏపీ అభివృద్ది పధంలో ముందుకు వెళ్లాలన్నదే తన కోరిక అని చిరంజీవి కామెంట్ చేశారు. అందుకు మీరంతా నడుం బిగించాలని, మీరంతా ఇలాంటి వారికి (ఎన్‌డీఏ అభ్యర్థులు సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌ను చూపిస్తూ) ఓటేయండని చిరంజీవి అభిమానులుకు పిలుపునిచ్చారు. మీ ఆశీస్సులు వారికి ఉన్నాయనే భావాన్ని, నమ్మకాన్ని మాకు కలిగించండని అని చెప్పారు.

వారిద్దరిని గెలిపించాలని కోరుతూ చిరంజీవి ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. సీఎం రమేశ్‌ నా చిరకాల మిత్రుడు, పంచకర్ల రమేశ్‌ నా ఆశీస్సులతో రాజకీయంగా అరంగేట్రం చేశారు.. ఇద్దరూ నాకు కావాల్సినవారే.. ఇద్దరూ చాలా మంచివారే కాదు.. చాలా సమర్థులు.. వారిని గెలిపించండి.. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడతారనే నమ్మకం ఉంది.. అని మెగాస్టార్ చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు. చిరంజీవి ఇలా టీడీపీ, జనసేని, కూటమికి మద్దతు తెలపడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకపరిణామమని చెప్పవచ్చు.