Nara Lokesh

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 

సీఎం జగన్ వీడియో విడుదల చేసిన లోకేశ్ 

పొలిటికల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ కార్యకర్తలు ముందస్తు వ్యూహాలతో దాడులకు చేస్తారని పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తున్నా.. పోలీసులు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జరుగుతన్న ఘటనలలో అసలు బాధ్యులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 194వ రోజు నూజివీడు వద్ద వైసీపీ (YCP) కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే డీఎస్పీ అక్కడే ఉండి చోద్యం చూశారని, పైగాటీడీపీ కార్యకర్లతపైకి పోలీసులను పంపించారని మండిపడుతున్నారు.  కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నారా లోకేశ్‌ 194వ రోజు పాదయాత్ర మీర్జాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి,తుక్కులూరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

జెండాలు పట్టుకొచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు నియంత్రించలేదన్న ఆరోపణలువస్తుననాయి. వైసీపీ కార్యకర్తలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైపోలీసులు దాడికి దిగారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. యువగళం బహిరంగసభ వేదికనుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రిపేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ సీనియర్‌ నేతలు అయ్యన్న పాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ అక్రమ కేసులపై నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై (Chandrababu) ప్రతిప‌క్షనేత‌గా ఉన్న జ‌గ‌న్ రెడ్డి (YS Jagan) చేసిన‌వని మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరివేయండి, చెప్పుల‌తో కొట్టండి, చీపుర్లతోత‌ర‌మండి అని విధ్వేషం నింపే ప్రసంగాలు ఆ రోజు జగన్ చేశారని మండిపడ్డారు. ప్రతిప‌క్షనేత‌గా జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు నారా లోకేశ్.


Comment As:

Comment (0)