Bank Holidays

బ్యాంకు సెలవుల వివరాలు..

ఆగస్టు నెలలో 14 రోజులు మూతపడనున్న బ్యాంకులు

స్పెషల్ రిపోర్ట్- ఆగస్టు (August) నెలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడేస్ క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతో పాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు నెలలో వివిధ బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకున్న ఖాతాదారులు సెలవులకు అనుగుణంగా ప్లాన్‌ చేసుకోవాల్సిన అవసరముందని ఆర్ధఇక రంగ నిపుణులు సూచిస్తున్నారు. 

ఐతే బ్యాంకులు మూసేసినా ఇంటెర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ (UPI) సేవలు నిరంతరం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. కానీ ప్రత్యేకించి బ్యాంకుకు సంబందించిన బ్రాంచిలలోనే పూర్తి చేసుకోవాల్సిన కొన్ని లావాదేవీలకు మాత్రం ఈ సెలవు దినాల్లో అవాంతరాలు కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. ఈ నేపధ్యంలో డిపాజిట్‌ దారులు గమనించి ప్రత్యమ్నయా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆగష్టు నెలలో బ్యాంకుల సెలవు దినాల (Bank Holidays) జాబితా..
ఆగస్టు 6- ఆదివారం
ఆగస్టు 8- టెండాంగ్‌ లో రమ్ ఫాట్  ( సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో సెలవు)
ఆగస్టు 12- రెండో శనివారం 
ఆగస్టు 13- ఆదివారం
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో సెలవు)
ఆగస్టు 18- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి ( అస్సాం గౌహతిలో సెలవు)
ఆగస్టు 20- ఆదివారం
ఆగస్టు 26– నాలుగో శనివారం
ఆగస్టు 27- ఆదివారం 
ఆగస్టు 28 - మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురంలో సెలవు)
ఆగస్టు 29 - తిరుఓణం (కొచ్చి, తిరువనంతపురంలో హాలిడే)
ఆగస్టు 30- రక్షా బంధన్
ఆగస్ట్ 31- రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ (డెహ్రాడూన్, గ్యాంగ్‌‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో సెలవు)

పై సెలవులకు అనుగునంగా మీ మీ బ్యాంకు లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు.


 


Comment As:

Comment (0)