Weekly Horoscope

ఈ వారం రాశి ఫలాలు ఆగష్టు 20 నుంచి 26 వరకు

స్పెషల్ రిపోర్ట్- ఈ వారం ఆగష్టు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీ రాశి ఫలాలు  (Zodiac Signs) ఎలా ఉన్నాయో తెలుసుకోంది...

మేష రాశి (Aries)- కాలం అనుకూలంగాఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. నిర్ణయం తీసుకున్నాక ఇక దాని గురించి ఆలోచించవద్దు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలున్నా కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత అవసరం. సద్భావన విశేష లాభాన్నిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. రుణ సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవతాస్మరణ శక్తినిస్తుంది.


వృషభ రాశి (Taurus)- వ్యాపార లాభాలున్నాయి. పరిస్థితులకు అనుగునంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. ఉద్యోగంలో అజాగ్రత్త పనికిరాదు. సూర్యదోషం గోచరిస్తోంది. ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. సమయస్ఫూర్తితో సత్ఫలితాలు సాధిస్తారు. సూర్యారాధన వల్ల మంచి జరుగుతుంది.


మిధున రాశి (Gemini)- ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. అనుకున్న స్థాయికి చేరుకుంటారు. అనుకూలమైన కాలం. విజ్ఞానపరంగా అభివృద్ధి చెందాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మంచి నిర్ణయాలతో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. పొరపాట్లు జరగనివ్వకుండా  జాగ్రత్తపడాలి, ధర్మాన్ని వీడవరాదు. మిత్రుల సహకారం లభిస్తుంది. విష్ణుసహస్రనామ స్మరణ శుభప్రదం.


కర్కాటక రాశి (Cancer sign)- బిజినెస్ లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభముంటుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. గందరగోళ పరిస్థితి తొలగిపోతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. శత్రు దోషం తొలగిపోతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


సింహ రాశి (Leo)- తాజా పరిస్థితులను అవగతం చేసుకుంటూ ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గ్రహ దోషం వల్ల విఘ్నాలు ఉంటాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. మొహమాటం పక్కన పెట్టి పనిచేయాలి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. పనులు వాయిదా వేయరాదు. నవగ్రహ దేవతలను స్మరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


కన్య రాశి (Virgo)- ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోబలంతో ఆటంకాలను అధిగమించాలి. ప్రతి విషయాన్నీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈర్ష్యతో నిందారోపణలు చేసేవారున్నారు, శాంతంగా ఉండాలి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఏకాదశంలో శుక్రుడి వల్ల ధనయోగముంది. ఇష్టదేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది.


తులా రాశి (Libra)- ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడతారు. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం కనిపిస్తోంది. తొందర పాటు నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ద్వాదశంలో కుజుడి వల్ల రుణసమస్యలు పెరగే అవకాశం ఉంది. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే శుభం జరుగుతుంది.


వృశ్చిక రాశి (Scorpio)- ఇది అనుకూలమైన కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడు తుంది. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. లక్ష్మీదేవిని దర్శిస్తే మంచి జరుగుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)- ప్రస్తుత కాలం అనుకూలిస్తుంది. ప్రయత్నలోపం లేకుండా కృషిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అధికార యోగం కనిపిస్తోంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. పని ప్రారంభించాక నిర్ణయాలను మార్చవద్దు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో ఇబ్బంది పెట్టేవారుంటారు. సూర్య నారాయణుడి దర్శనం శుభప్రదం.


మకర రాశి (Capricorn)- నూతన పనులు ప్రారంభించవద్దు. ప్రతి అడుగూ ఎంతో జాగ్రత్తగా వేయాలి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయాలి. ధైర్యం రక్షిస్తుంది. ఆటంకాలు కలిగించే వారుంటారు. ఎవరినీ నమ్మి డబ్బు ఇవ్వవద్దు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. వ్యాపారం బాగుంటుంది. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, అనుకున్నది సాధిస్తారు.


కుంభ రాశి (Aquarius)- సకాలంలో పని ప్రారంభించాలి. విఘ్నాలు ఉన్నాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తరువాత వెనకడుగు వేయరాదు. లక్ష్యం చేరేవరకూ కృషి చేయాలి. సంయమనం పాటించాలి. చంచల నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పనులను మధ్యలో ఆపరాదు. తగిన విశ్రాంతి తీసుకోండి. నవగ్రహ శ్లోకాలు చదువితే విజయం లభిస్తుంది.


మీన రాశి (Pisces)- అంతా శుభమే కనిపిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదృష్టయోగాన్ని అందిపుచ్చుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసివస్తుంది. అధికార యోగం గోచరిస్తోంది. పెద్దలు ప్రసన్నులవుతారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. లక్ష్మీదేవిని స్మరిస్తే ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.

ఇవీ ఈ వారం రాశీ ఫలాలు. మళ్లీ వచ్చే వారం రాశీ ఫలాల కోసం ఫాలో అవ్వండి న్యూస్ పిల్లర్ డాట్ కామ్. Newspillar.com
 


Comment As:

Comment (0)