విరాట్ కోహ్లీ ఫన్ వీడియో
వాటర్ బాయ్ గా విరాట్ కోహ్లీ.. బంగ్లాతో మ్యాచ్‌లో సరదా సీన్
స్పోర్ట్స్ రిపోర్ట్- విరాట్ కోహ్లీ (Virat Kohli) కొన్ని సార్లు సీరియస్ గా ఉన్నా.. చాలా సందర్బాల్లో ఎంతో సరదాగా ఉంటాడన్న సంగతి అభిమానులకు తెలిసిందే. ఈ టీమిండియా మాజీ కెప్టేన్.. ఫీల్డింగ్‌లో ఉన్నా, డగౌట్ లో కూర్చున్నా, తన హుషారుతో తోటి ఆటగాళ్లలో జోష్ నింపడం అందరం చూస్తూనే వస్తున్నాం. మరికొన్ని సందర్బాల్లో గ్రౌండ్ లో తన హావభావాలతో నవ్వు తెప్పిస్తుంటాడు విరాట్. ఇదిగో తాజాగా ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ (IND vs BAN) లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ స్టార్ బ్యాటర్ తన జట్టు ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ (Water Boy) గా మారడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే.. బంగ్లా ఆటగాడు అనముల్ హక్ ఔటైన తరువాత విరాట్ కోహ్లీ (Virat Kohli), గ్రౌండ్ లో ఉన్న తన సహచర ఆటగాళ్ల కోసం తానే స్వయంగా మంచి నీళ్ల బాటిల్స్ తీసుకెళ్లాడు. ఐతే కోహ్లీ అలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్లే టైంలో అతడు పరిగెత్తిన తీరు చాలా సరదాగా అన్పించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింకెందుకు ఆలస్యం.. విరాట్ సరదా వీడియో మీరు కూడా చూసేయండి.
On the field or off the field, can't get our eyes off this guy