Zodac Signs

ఈ వారం మీ రాశి ఫలాలు - ఆగస్టు 27  నుంచి సెప్టెంబరు వరకు

ఈ వారం మీ రాశి ఫలాలు - ఆగస్టు 27  నుంచి సెప్టెంబరు వరకు
 

మేష రాశి (Aries)- ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మీ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తారు. బిజినెస్ లో కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. గృహ, వాహన లాభాలు ఉంటాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా పట్టుదలతో పనిచేయండి. శత్రుదోషం తొలగుతుంది. తీపికబురు వింటారు. లక్ష్మీదేవి సందర్శనం చేయండి.


వృషభ రాశి (Taurus)- ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో మీదైన ప్రతిభ కనబరుస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం ఆవహించకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. శుభవార్త వింటారు. విష్ణు ఆరాధన చేయండి.


మిధున రాశి (Gemini)- ఆ రాశి వారికి గ్రహబలం విశేషంగా ఉంది. విలువైన కాలాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని సాధించాలి. ఉత్సాహం కలిగించే వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఒక ముఖ్యమైన పనిని పట్టుదలగా పూర్తిచేస్తారు. బిజినెస్ లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మహాగణపతి ఆరాధన మంచిచేస్తుంది.


కర్కాటక రాశి (Cancer sign)- ఈ రాశి వారికి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. మీ ఆశయం నెరవేరుతుంది. ధర్మమార్గంలో ముందుకెళ్లండి. ఇతరులకు ఉపకాలం చేసే బుద్ధితో పనిచేయండి. అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. వృత్తిలో మంచి ఫలితాలుంటాయి. బిజినెస్ లో దశదిశలా వ్యాపిస్తారు. పలు మార్గాల్లో విజయం సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. లక్ష్మీ ఆరాధన మంచి చేస్తుంది.


సింహ రాశి (Leo sign)- ఈ రాశి వారికి ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఐతే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు. అప్పు పెరగకుండా జాగ్రత్తపడాలి. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. వారాంతంలో మంచి ఫలితాలుంటాయి. ఆదిత్య హృదయం చదవడం మంచి చేస్తుంది


కన్య రాశి (Virgo)- ఈ రాశి వారికి ఏకాగ్రతతో పని ప్రారంభిస్తే విజయం చేకూరుతుంది. ఈ పనైనా మధ్యలో వాయిదా వేయకూడదు. అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఊహించని ఖర్చులు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. కొందరు మీకు మనస్తాపాన్ని కలిగించినా ఏ మాత్రం తొందరపడవద్దు. దత్తాత్రేయ దర్శనం మంచి చేస్తుంది.


తుల రాశి (Libra)- ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. ఎటు చూసినా విజయం కనిపిస్తుంది. బిజినెస్ లో అధిక లాభాలు ఉంటాయి. సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది. అందరితో ప్రశంసలు అందుకుంటారు. అదృష్టయోగం కనిపిస్తోంది. మొదలుపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. బంధు మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆంజనేయస్వామి సందర్శనం మనస్సుకు శాంతి ఇస్తుంది.


వృఛ్చిక రాశి (Scorpio)- ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. స్థిరమైన ఫలితాలు వస్తాయి. పట్టుదలే విజయానికి మూలమని గుర్తిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. ఐతే ఖర్చులు పెరగనివ్వద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. వ్యక్తిగత విషయాలు అపరిచితులతో పంచుకోవద్దు. కొత్త వస్తువులను కొంటారు. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం పఠిస్తే మంచి జరుగుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)- ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. అన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ఫలితాలు వచ్చేవరకూ శ్రమించాలి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక  ముఖ్యమైన వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టదైవారాధన చేస్తే శుభం కలుగుతుంది.


మకర రాశి (Capricorn)- ఈ రాశి వారికి సంకల్పబలం ముఖ్యం. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. తోటివారితో స్నేహపూర్వకంగా సంభాషించాలి. అపార్థాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఒత్తిడి లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మిమ్మల్ని దైవబలం ముందుకు నడిపిస్తుంది. సకాలంలో పనిచేస్తే బిజినెస్ లో అడ్డంకులను అధిగమించవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శనిదేవుని దర్శనం మంచి ఫలితాలనిస్తుంది.


కుంభ రాశి (Aquarius)- ఈ రాశి వారు మనోబలంతో పనులు పూర్తిచేయాలి. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అస్సలు ఆవేశానికి గురికావద్దు. సకాలంలో సహనంతో చేసే పని విజయాన్ని చేకూరుస్తుంది. స్నేహితుల సాయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఐతే ఖర్చు తగ్గించుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సూర్యాష్టకం చదివితే మంచి జరుగుతుంది.


మీన రాశి (Pisces)- ఈ రాశి వారికి అదృష్టకాలం. కొత్తగా చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం చేకూరుతుంది. బిజినెస్ లో విశేష లాభాలుంటాయి. వస్తు వస్త్ర వాహన ప్రాప్తి కనిపిస్తుంది. మీ వల్ల కొందరికి మంచి జరుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఇష్ట దేవతాస్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

రాశి ఫలలు కేవలం నమ్మకం, ధైర్యం మాత్రమే. కష్టపడి పనిచేయకుంటే ఏది సాధ్యం కాదన్నది మాత్రం నిజం.


Comment As:

Comment (0)