BRS KCR Kavitha

కూతురు కవిత విషయంలో కేసీఆర్ మౌనం వెనుక మతలబేంటీ?

కవిత ఆరెస్ట్ పై కేసీఆర్ మౌనం వెనుక?

కూతురు అరెస్ట్ పై స్పందించని కేసీఆర్

జైలులో కవితను కనీసం పలకరించిన కేసీఆర్

కవిత విషయంలో కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా?

లోక్ సభ ఎన్నికల వరకు కవిత అరెస్ట్ పై కేసీఆర్ స్పందించరా?

లోక్ సభ ఎన్నికల తరువాత ఢిల్లీకి కేసీఆర్?

పొలిటికల్ రిపోర్ట్- కూతురు (Kalvakuntla Kavitha) అరెస్టై నెలరోజులు కావస్తోంది.. సుమారు ౩౦ రోజుల నుంచి తీహార్ జైల్లోనే ఉంటోంది.. ఈడీ కస్టడీ నుంచి ఇప్పుడు సీబీఐ కస్టడీకి వెళ్తోందామె.. అయినా తండ్రి మాత్రం కూతురును పలకరించలేదు. ఆమె అరెస్టెపై కనీసం స్పందించలేదు. అవును కవిత అరెస్ట్ పై కేసీఆర్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ కవిత అరెస్ట్ పై కేసీఆర్ (KCR) ది వ్యూహాత్మక మౌనమా? లేదంటే లోక్ సభ ఎన్నికల వేళ పార్టీకి నష్టం చేస్తుందన్న ఆలోచనా?

ఢిల్లీ లిక్కర్స్కాం (Delhi Liquar Case), మానిలాండరింగ్కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత నెల మార్చి 15న అరెస్ట్ అయ్యింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తరువాత కవితను తీహార్ జైలుకు తరలించారు. ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మొత్తానికి కవిత అరెస్టై నెలరోజులు ఆవుతోంది. ఆమె కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు వంటి వారు ఆమెను పలకరించినా ఇంతవరకు తండ్రి కేసీఆర్ మాత్రం కవితను కలవలేదు. కనీసం ఆమె అరెస్ట్ పై మాట మాత్రం మాట్లాడలేదు.

ముందు నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సుమారు రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచి మొదలు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో ఆమెను సీబీఐ విచారణ వరకు కేసీఆర్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. ఒకటి రెండు సందర్బాల్లో ఢిల్లీ లిక్కర్ కేసు తప్పుడు కేసు అని మాత్రం ముక్తసరిగా అనడమే తప్ప పెద్దగా స్పందించలేదు. ఐతే కేసు సంగతి పక్కనవపెడితే కన్న కూతురు కవిత అరెస్టైతే కూడా కేసీఆర్ స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె జైలుకు వెళ్లినా దానిపై మాట్లాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

కూతురు కవిత తీహార్ జైల్లో ఉన్న సమయంలో కనీసం ఆమెను చూడటానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఇదే కేసీఆర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైతే ఖండించిన కేసీఆర్.. కూతురు ఆరెస్ట్ ను ఎందుకు ఖండించలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరోచీకటి రోజని కామెంట్ చేసిన కేసీఆర్.. కవిత అరెస్ట్ విషయంలో మాత్రం మౌనం వహించారు. తనపైనా, పార్టీ నేతలపైన ప్రతిపక్షాలు చిన్న మాటన్నా తనదైన స్ట్రైల్లో కడిగిపారేసే కేసీఆర్.. కూతురును జైల్లో పెట్టినా ఎందుకు చిన్న మాట కూడా మాట్లాడ లేదు. ఇలా కవిత అరెస్టె విషయంలో కేసీఆర్ స్పందించకపోవడంపై సొంత పార్టీ బీఆర్ఎస్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపతోంది.

ఐతే కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ పై కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమని బీఆర్ఎస్ నేతలు కొందరంటున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ కవిత అరెస్ట్ పై స్పందించినా, వెళ్లి ఆమెను కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అది లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తుందన్న కారణంగానే కేసీఆర్ ఏం మాట్లాడటం లేదని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత కవిత కేసు నుంచి బయటకు వచ్చే వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కన్న కూతురు అరెస్టై, జైలులో ఉంటే కనీసం వెళ్లి చూడకపోవడం, అరెస్ట్ పై మాట్లాడకుండా ఉంటున్న కేసీఆర్ వైఖరి ఏ మాత్రం అంతుపట్టడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 


Comment As:

Comment (0)