అంగీక‌రించిన టెలికాం క‌మిష‌న్‌

news02 May 2, 2018, 12:27 p.m. business

airplane
ఢిల్లీ: ఇప్ప‌టి వ‌ర‌కూ విమానాల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకునేందుకు విమాన‌యాన సిబ్బంది అనుమ‌తిచ్చే వారు కాదు. ఫ్లైట్ లో ఫోన్ మాట్లాడితే అభ్యంత‌రం చెప్పే వారు. అయితే ఇప్పుడు ఈఇబ్బందికి బ్రేక్ ప‌డ‌నుంది. మ‌రో 3-4 నెల‌ల్లో విమానాల్లో నిర‌భ్యంత‌రంగా కాల్స్ చేసుకునే అవ‌కాశం రాబోతోంది. విమానాల్లో  ప్ర‌యాణికులు ఫోన్స్ కాల్స్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేద‌ని టెలికాం క‌మిష‌న్ తెలిపింది. ఫ్లైట్స్‌లో ప్యాసెంజ‌ర్స్ కాల్స్ మాట్లాడుకునేందుకు ఆమోదం తెలిపింది. 

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా కొన్ని సంస్థ‌లు ప్ర‌యాణికులు విమానాల్లో కాల్స్ మాట్లాడుకునేందుకు అనుమ‌తి ఇస్తున్నాయి. కాల్స్‌తో పాటు వైఫై సేవ‌ల‌ను కూడా అందిస్తున్నాయి. అయితే ఇలాంటీ సేవ‌లు భార‌త గ‌గ‌న‌త‌లంలోకి రాగానే నిలిచిపోతాయి. అయితే కొత్త‌గా టెలికాం క‌మిష‌న్ విమానాల‌లో ఫోన్స్ కాల్స్ మాట్లాడుకునేందుకు ఆమోదం తెలిపినందునా... అందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను రూపొందించాల్సి ఉంద‌ని టెలికం అధికారులు చెబుతున్నారు. ఈప‌నుల‌కు సంబంధించి బిడ్ల‌ను ఆహ్వానించి ప‌నుల‌ను అప్ప‌గించాల్సి ఉందంటున్నారు. ఈత‌తంగం అంతా పూర్తైతే త్వ‌ర‌లోనే సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెబుతున్నారు. 

tags: flight,airplane,india,telecom,indianairlines,airindia

Related Post