కస్టమర్లకు sbi బ్యాంక్ షాక్

news02 March 3, 2018, 6:52 a.m. business

Sbi collect atm charges

SBI బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉందా..? అయితే ఈ వార్త మీకోసమే .. మీ అకౌంట్ నుంచి చెప్పా పెట్టకుండా 147.5 రూపాయలు కట్ అయ్యాయి.. ఇవి మీ ఏటీఎం కార్డు యానువల్ టాక్స్ అట. ఇండియాలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన SBI లో 420 మిలియన్ అకౌంట్ లున్నాయి. ఇందులో ఏటీఎం కార్డ్ వాడే ప్రతిఒక్కరిదగ్గరనుంచి 147.5 రూపాయలు కలెక్ట్ చేసింది బాంక్. అంటే మొత్తం 420000000(M)×147.500= 6195000000000/-Rs ( అక్షరాల ఆరు లక్షల పంతొమ్మిదివేల ఐదు వందల కోట్లు ) చొప్పున సేకరించింది.

అకౌంట్ లో మినిమం 5 వేలు లేకపోతే నెలకు 150 రూపాయలు కట్ చేసిన అనుభవం ఆ బ్యాంక్ కస్టమర్లకు అందరికి ఉంటుంది. ఒక ఏడాదిలోనే ఇలా 1771 కోట్ల రూపాయల జనాల డబ్బును జరిమానా రూపంలో చెప్పపెట్టకుండా తీసుకుంది SBI బ్యాంక్. ఇప్పుడు ఏడాది ఎటిఎం టాక్స్. బ్యాంక్ వ్యవహారం పై కస్టమర్లు మండి పడుతున్నారు.

సామాన్య జనాల దగ్గర ఇలాంటి ఫైన్ లు,టాక్స్ లు వసూలు చేసి విజయ మాల్యా, నీరవ్ మోడీ,లలితా మోడీ, దీపకతల్వార్,సంజయ్ బండారు లాంటి వక్తులకి లక్షల కోట్ల డబ్బును లోన్ లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాక్కున్న వీరి దగ్గరనుంచి వసూలు చేయలేని బ్యాంక్ లు సామాన్య జనం కష్టపడి బ్యాంక్ లో దాచుకుంటే ఇలా పీక్కుతింటున్నారని గగ్గోలు పెడుతున్నారు. జనాల డబ్బులను ఏదో ఒక రూపంలో దోచుకోవటంలో SBI ముందంజలో ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

Related Post