వాట్సాప్‌కు పోటీగా కింభో

news02 May 31, 2018, 11:04 a.m. business

kimbo application

ఢిల్లీ: ఫిట్‌నెట్ గురూ కొత్త యాప్ వ‌చ్చేంది. వాట్సాప్‌ను ఢీకొట్టేందుకు యోగా గురువు రాందేవ్‌బాబా ప‌తాంజ‌లి సంస్థ మార్కెట్‌లోకి కొత్త యాప్‌ను తీసుకువ‌చ్చింది. అచ్చం వాట్సాప్ లాగా సందేశాల‌ను పంపుకునేందు కో్సం ప‌తాంజ‌లి సంస్థ ఈయాప్ రూపొందించింది. కొత్త‌గా రూపొందించిన యాప్‌కు కింభోగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈయాప్ బుధ‌వారం నుంచే అందుబాటులోకి రానుంది. నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కింభో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

ramdev baba sims

అయితే ఇప్ప‌టికే ప‌తాంజ‌లి సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి స్వ‌దేశీ స‌మృద్ధి యోజ‌న పేరుతో జియోకు పోటీగా కొత్త సిమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది తెలిసిందే. ఇక తాజాగా వాట్సాప్‌కు పోటీగా కింభో యాప్‌ను రూపొందించ‌డంతో... అది ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేదానిపై ఆస‌క్తి నెల‌కొంది. కొత్త‌గా వ‌చ్చిన కింభో యాప్ ఏమేర‌కు మార్కెట్‌ను కైవ‌సం చేసుకుంటోందో చూడాలి మ‌రి. 

ramdev baba kimbo app

 

tags: kimbo app, fitness guru, patanjali, ramdev baba, yoga, sim, google play store,

Related Post