బీర్ల డిమాండ్ కు తట్టుకోలేక పోతున్న సర్కార్

news02 May 22, 2018, 10:40 p.m. business

Beer rate hike in telangana

హైదరాబాద్ : మండుతున్న ఎండల్లో చల్లని బీరు తాగుతున్న మందు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్తను అందించింది. ఉన్నట్లుండి లైట్ బీర్ పై రూ.10 , స్ట్రాంగ్ బీర్ పై రూ.20 పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎండాకాలం మొదలవగానే డిమాండ్ అమాంతం పెరిగిపోవడం తో బీర్ల ధరలు పెంచక తప్పలేదు. ఏప్రిల్ నెలలో బీర్ల అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెలలో 54 లక్షల కేసులు అమ్మినట్లు రికార్డ్ అయ్యింది. జూన్ మొదటి వారం వరకు ఇంకా బీర్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో షాపులకు రెండు, మూడు రోజులకొకసారి బెవేరేజెస్ నుంచి బీర్లు సప్ప్లై చేసేవాళ్ళు. రెండు నెలలుగా ప్రతి రోజు షాపులకు బీర్లు సప్లై చేస్తున్నారు.

Beer Demand in telangana

ఏపీనుంచితెలంగాణకుబీర్లతరలింపు

తెలంగాణ లో డిమాండ్ కు తగ్గ బీర్ల తయారిలేక కొరత ఏర్పడుతుంది. దీంతో ఏపీ నుమచి5 బీర్ల కేసులు తేపిస్తున్నట్లు తెలిసింది. మార్చ్ నుంచి ప్రతినెలా 10 లక్షల కేసుల బీర్లు తెలంగాణా కు తెప్పిస్తున్నట్లు తెలిసింది.

tags: Wine shops, beer deamnd, beer rates hike, telangana wines, ts beverages, cm kcr , summer demand.

Related Post