టివి ల మార్కెట్లోకి MI కంపెనీ

news02 Feb. 14, 2018, 10:04 p.m. business

 MI TV

ముంబై : పేరుకే మేడ్ ఇన్ చైనా.. కానీ ఇండియా లో ప్రజల మనసుల్లో స్థిరస్థాయిలో నిలిచిపోయింది. అదే MI బ్రాండ్. స్మార్ట్ ఫోన్ ల విషయంలో ఇండీయాలో అతి ఎక్కువగా అమ్ముడు కావడమే కాదు.. మొబైల్ ఫోన్ ల రంగంలో రికార్డ్ స్థాయిలో ఉన్న శాంసంగ్ కంపెనీని వెనక్కి నెట్టి స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో నెంబర్ ఒన్ గా నిలిచింది. ఇప్పుడు మార్కెట్లోకి MI fully HD ఎల్ఇడి టివి ని బుధవారం మార్కెట్ లోకి విడుదల చేసింది.

ప్రపంచం లో ఇంతకన్నా పలుచన టివి మరోటి లేదని కంపెనీ ప్రకటించింది. 4K డిస్ ప్లే.. 55 ఇంచ్ గా స్క్రీన్ తో ఇండియా మార్కెట్లోకి వచ్చేసింది. ప్రస్తుతానికి ఒకే మోడల్ వచ్చింది. మన దేశంలో MI టివి ధర 39,999 లుగా నిర్ణయించింది కంపెనీ. 11 బటన్ లతో టీవీ రిమోట్ కలిగి ఉండటం మరో విశేషం. ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్, MI స్టోర్ లలో ఆన్ లైన్ లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 22 వ తేదీనుంచి టివి అందుబాటులోకి వస్తుంది.

MITV455స్పెషాలిటీలు..

స్క్రీన్ LED డిస్ ప్లే 55 4K టెక్నాలజీ (3840*2160 రెజెల్యూషన్)

2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజీ

USB 3.0, USB 2.0 డ్యూయల్ బ్యాండ్.

వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ

Dolby, DTS సినిమా ఆడియో క్వాలిటీ 8 వాల్ట్స్ రెండు స్పీకర్స్ ఇన్ బిల్ట్

ఈ టీవీ మందం కేవలం 4.9mm మాత్రమే.

లాంఛింగ్ఆఫర్స్ ...

రూ.39,999 చెల్లిస్తే.. సెట్ టాప్ బాక్స్ ఫ్రీ ఇస్తోంది. Mi IR కేబుల్ ద్వారా వాయిస్ కంట్రోల్ ఫీచర్స్ ఇస్తోంది. 5లక్షల కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హార్ట్ స్టార్, వోట్, సోనీ హంగామా ప్లే లాంటి 15 ఛానల్స్ కంటెంట్ ను ఉచితంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం వాడే కేబుల్ కనెక్టివిటీ, ఇతర కంపెనీ ల సెటప్ బాక్స్ లు పనికిరావు. కేవలం MI సెటప్ బాక్స్ లు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఈ బాక్స్ కు 619 రూపాయల విలువైన రీఛార్జ్ ఉచితమని కంపెనీ ప్రకటించింది. ఎలాంటి ఫిట్టింగ్ ఛార్జీలు లేవని తెలిపింది.

tags: Mi tv, latest Mi smart phone , xiaomi tv, fully smart tv, flipkart, mi website.

Related Post